యంగ్ జనరేషన్ హీరోలలో అల్లు అర్జున్  చాలా యాక్టివ్ అనీ ఫుల్ ఎనర్జీ తో సినిమా కోసం ప్రాణం పెట్టేస్తాడు అనీ అంటూ ఉంటారు. బన్నీ తన సినిమా కోసం చేసే ఒక ఫైట్ అయినా సీన్ అయినా ఏదైనా కూడా విపరీత్మగా కష్టపడతాడు. పదే పదే రిహార్సల్ చేస్తూ ఉంటాడు కూడా. ప్రతీ డైరెక్టర్ ఆ విషయం ఏదో ఒక సందర్భంలో చెబుతూనే ఉంటాడు.

ప్రస్తుతం వక్కంతం వంశీ డైరెక్షన్ లో చేస్తున్న నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా సినిమాకి కష్టపడుతూ ఉన్న అల్లు అర్జున్ ఈ సినిమా కోసం ఫైట్ లకి సంబంధించి స్పెషల్ క్లాస్ లు కూడా తీసుకుంటూ ఉన్నాడట. ఫామిలీ - దేశభక్తి నేపధ్యం లో ఈ సినిమా సాగుతుందట. ఫిట్నెస్ సరిగ్గా ఉండాలి అ న్నే  ఉద్దేశ్యం తో విపరీతంగా కసరత్తు చేస్తున్నాడు బన్నీ. 

కొన్ని రోజులుగా ఈ సినిమా షూటింగ్ ఊటీలో జరుగుతూ వచ్చింది. ఒక్కరోజు గ్యాప్ తో తరువాత షెడ్యూల్ షూటింగును హైదరాబాద్ లో చేస్తున్నారు.

40 రోజులుగా నాన్ స్టాప్ గా కొనసాగుతోన్న ఈ సినిమా షూటింగులో బన్నీ విరామం లేకుండా పాల్గొంటున్నాడు. ఎనర్జీ లెవల్స్ విషయం లో కాస్తంత కూడా తగ్గకుండా ప్లాన్ చేస్తున్నాడు అల్లు అర్జున్. ఈ ఎనర్జీ లెవెల్స్ చూసి బన్నీ టీం మేట్స్ సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు అని సమాచారం. 


మరింత సమాచారం తెలుసుకోండి: