దక్షిణాది సినిమా రంగంలో స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలుగుతున్న అనుష్క వయస్సు 36 సంవత్సరాలు దాటిపోయినా వరసపెట్టి సినిమాలు చేస్తూ యంగ్ హీరోయిన్స్ కు సవాల్ విసురుతోంది. ఈమె పెళ్ళిగురించి ప్రేమ గురించి అనేక సార్లు గాసిప్పులు రావడం వాటిని అనుష్క ఖండించడం ఎప్పటి నుంచో జరుగుతున్న విషయమే.
త్వరలో 'భాగమతి' సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న అనుష్క ఈమధ్య ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అనేక ఆసక్తికర విషయాలతో పాటు తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన సీక్రెట్ ను కూడ లీక్ చేసింది. తాను టీనేజ్ లో ఉన్నపుడు తాను కూడ ఒక స్టార్ క్రికటర్ ను ప్రేమించానని చెపుతోంది అనుష్క.
అతడు మరెవరో కాదు. ప్రముఖ క్రికెటర్ రాహుల్ ద్రవిడ్. తనకు చిన్న తనం నుండి ద్రవిడ్ అంటే బాగా ఇష్టమని ఒకానొక సమయంలో ద్రవిడ్‌తో పీకల్లోతు ప్రేమలో పడిపోయాను అంటూ అనుష్క వెల్లడించింది. అయితే ఈ ప్రేమ మాత్రం అనుష్క వన్ సైడ్ లవ్ అట. కానీ ప్రస్తుతం తాను ఎవరితోనూ ప్రేమలో లేనని ప్రేమ గురించి ఆలోచించే తీరిక కూడ తనకు లేదు అని చెపుతోంది ఈ యోగా బ్యూటీ.
ప్రస్తుతం ‘భాగమతి’ లో నటిస్తున్న అనుష్క ఆసినిమా పై చాల ఆశలు పెట్టుకుంది. దక్షిణాది సినిమా రంగంలో అనుష్క స్థాయిలో ఇలాంటి భారీ పాత్రలు చేయగల హీరోయిన్స్ మరెవ్వరూ లేకపోవడంతో మరికొన్ని సంవత్సరాలు అనుష్క హవా కొనసాగే ఆస్కారం ఉంది..