దసరా రేసును టార్గెట్ చేస్తూ విడుదలైన ‘జై లవ కుశ’ నిన్న తన అర్ధశత దినోత్సవం జరుపుకుంది. ఎంత సూపర్ హిట్ సినిమా అయినా నాలుగువారాలు ఆడటం కష్టంగా ఉన్న ఈరోజులలో మన తెలుగు రాష్ట్రాల్లో అక్కడక్కడా ఈ సినిమా ఇంకా ఆడుతోంది. ఎన్టీఆర్ అభిమానులు నిన్నటిరోజు ఈసినిమా ప్రదర్శిస్తున్న ధియేటర్స్ లో సందడి చేసారు. 

ఈమూవీకి డివైడ్ టాక్ వచ్చినా సుమారు 73 కోట్ల షేర్ రాబట్టి టాలీవుడ్ హైయెస్ట్ గ్రాసర్ల జాబితాలో ఎనిమిదో స్థానంలో నిలిచింది. ఎక్కువ రేట్లకు అమ్మడం వల్ల సినిమా యావరేజ్ ముద్ర వేయించుకుంది కానీ ఇలాంటి యావరేజ్ మూవీతో కూడ ఈ స్థాయిలో వసూళ్లు రాబట్టడం ఎన్టీఆర్ బాక్సాఫీస్ స్టామినా చాటిందని విశ్లేషకులు అంటున్నారు. 

ఇది ఇలా ఉండగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని ఒక ధియేటర్ ‘జై లకువశ’ 50 రోజులు ఆడటం విశేషంగా భావిస్తూ జూనియర్ అభిమానులు సందడి చేసారు. ఈ ఒక్క ధియేటర్ లోనే ‘జై లవ కుశ’ కోటి రూపాయల గ్రాస్ వసూలు చేసిందని జూనియర్ అభిమానుల హడావిడి. 

అయితే ఇలాంటి ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌ లోని సుదర్శన్ థియేటర్లలో వరుణ్ తేజ్ ‘ఫిదా’ మూవీ కోటి రూపాయల గ్రాస్ వసూలు చేసింది, దానికి ఎలాంటి స్టార్ కాస్ట్ లేదు. ఎన్టీఆర్ లాంటి స్టార్ సినిమా కోటి రూపాయల గ్రాస్ వసూలు చేయడాన్ని గొప్పగా చెప్పుకోవాలా ? లేదంటే ఒక చిన్న హీరోతో అతి తక్కువ బడ్జెట్ తో తీసిన ‘ఫిదా’ రికార్డును గొప్పగా చెప్పుకోవాలా అంటూ కొందరు మెగా అభిమానులు జూనియర్ అభిమానులను టార్గెట్ చేస్తూ వేస్తున్న సెటైర్లను విని జూనియర్ అభిమానులు తీవ్ర అసహనంలో ఉన్నట్లు టాక్..  


మరింత సమాచారం తెలుసుకోండి: