టాలీవుడ్ మోస్ట్ పాపులర్ కపుల్ ఎవరు అంటే ఎవరైనా మరొక మాట మాట్లాడకుండా చరణ్ ఉపాసనల జంటను చెపుతారు. వీరిద్దరికీ పెళ్ళి అయి ఐదు సంవత్సరాలు దాటినా ఇప్పటికీ కొత్త జంటగా కనిపిస్తూ వారు వెళ్ళే ఫంక్షన్స్ లో మీడియా కెమెరాలకు హాట్ టాపిక్ గా మారుతు ఉంటారు. 

దీనికితోడు ఉపాసన కూడ సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉంటూ చరణ్ కు తనకు సంబంధించిన విషయాలను వారి వ్యక్తిగత ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అనునిత్యం తెగ సందడి చేస్తూనే ఉంటుంది. చరణ్ ను ముద్దుగా ‘మిస్టర్ సి’ అని పిలుచుకునే ఉపాసనకు చరణ్ పై కోపం వచ్చినప్పుడు చేసే పనిని లేటెస్ట్ గా బయట పెట్టింది. 

చరణ్ చిన్నతనంలోని ఒక ఫోటోను తన దగ్గర ఎప్పుడూ ఉంచుకుంటుందట ఉపాసన. ఆ ఫోటో చూస్తే చాలు అప్పటిదాకా ఉపాసనకు చరణ్ పై వచ్చిన కోపం వెంటనే మటుమాయం అయిపోతుండట. తనకోపాన్ని తగ్గించే ముద్దులొలుకుతున్న చరణ్ చిన్ననాటి ఫోటోను ఉపాసన బయటపెడుతూ చరణ్ పై తనకు వచ్చేకోపాన్ని తగ్గించే తారక మంత్రం ఇదే అంటూ సోషల్ మీడియాలో కామెంట్ చేసింది. 

ఈఫోటోను ఉపాసన షేర్ చేసిన కొద్దిసేపటికే అదిసోషల్ మీడియాలో అందరిదృష్టిని విపరీతంగా ఆకర్షించింది. దీనితో రామ్ చరణ్ చిన్ననాటి ఫోటో చూసి చెర్రీ ఫ్యాన్స్ కూడా ఫిదా అయిపోయారు. చిన్నతనంలో రామ్ చరణ్ చాలా అందంగా ఉన్నాడని ముద్దొస్తున్నాడని ప్రశంసలు కురిపిస్తున్నారు. రామ్ చరణ్‌తో పెళ్లి తర్వాత ఉపాసన కేవలం మెగాకోడలుగా మాత్రమే కాకుండా అపోలో హెల్త్ సంస్థకు డైరెక్టర్ గా ఆమె ఆసంస్థ అభివృద్ధి కోసం చేస్తున్న కృషితో ప్రస్తుతం ఆమె చాలబిజీగా ఉంటూ కూడ చరణ్ పై తనకు ఉన్నప్రేమను ఇలాబయట పెట్టింది అనుకోవాలి..  



మరింత సమాచారం తెలుసుకోండి: