‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి’ జీవిత చరిత్ర ఆధారంగా నిర్మింపబడుతున్న ‘సైరా’ షూటింగ్ ఇంకా ప్రారంభం కాలేదు. కథ ఫైనల్ అయినా ఈమూవీ రెగ్యూలర్ షూటింగ్ ఎప్పుడు ప్రారంభం అవుతుంది. అన్న విషయం ఒక్క మెగా కాంపౌండ్ కు తప్ప మరెవ్వరికీ తెలియని టాప్ సీక్రెట్ గా రామ్ చరణ్ మెయిన్ టైన్ చేస్తున్నాడు. ఈసినిమాకు సంబంధించి ప్రారంభోత్సవం జరిగి చాల నెలలు గడుస్తున్నా ఈసినిమాకు సంబంధించిన నటీ నటుల ఎంపిక ఇంకా కొనసాగుతూనే ఉంది. 

 ఈ చిత్రాన్ని భారతదేశ వ్యాప్తంగా గుర్తింపు ఉండే చిత్రంగా రూపొందించాలని చరణ్ భావిస్తున్న నేపధ్యంలో నటీనటుల ఎంపికకు సంబంధించి అనేక పేర్లు మారిపోతున్నాయి.ఈమూవీ తెలుగులోనే కాకుండా తమిళ హిందీ భాషలలో విడుదల చేస్తున్న నేపధ్యంలో ఆయా భాషలకు సంబంధించిన నటీనటులను తీసుకుని ఈమూవీ ప్రాజెక్ట్ కు మరింత క్రేజ్ తీసుకురావడానికి అనేక వ్యూహాలు రచిస్తున్నారు. 

ఇలాంటి పరిస్థుతులలో ఈ ప్రాజెక్టులో ఏదో ఒక పాత్రలో తాము కూడా కనిపిస్తే చాలుననే ఆశ చాలా మందికి కలిగిన నేపధ్యంలో ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలోని చాలామంది నటీనటులు మెగాకాంపౌండ్ చుట్టూ చక్కర్లు కొడుతున్నట్లుగా ఫిలింనగర్ లో గాసిప్పులు హడావిడి చేస్తున్నాయి. కథకు సంబంధించి ఈమూవీ స్వాతంత్ర్య పోరాట కాలానికి సంబంధించిన చారిత్రక నేపఉండటంతో ఈమూవీలో ఏ ఒక్క చిన్నపాత్ర పోషించినా దానికంటూ ప్రత్యేక గుర్తింపు ఉంటుందని చాలామంది భావించి రామ్ చరణ్ ను అదేవిధంగా చిరంజీవిని తమ పరిచయాలను బట్టి వారివారి స్థాయిలో ఈసినిమాలో నటించే చాన్స్ కోసం ఒత్తిడి చేస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. 

చిన్న నటులు ఓ పాత్ర అయినా చాలుననే ఆశతో ఇలాంటి ఒత్తిడి చేయడం సహజం. అయితే టాలీవుడ్ సీనియర్ నటులు కూడ పలువురు అతిథిపాత్రల మీద మక్కువ చూపెడుతూ మెగా కాంపౌండ్ చుట్టూ చక్కర్లు కొడుతున్నారని వార్తలు వస్తున్నాయి. నిన్న మొన్నటి వరకు పెద్ద సినిమాల్లో కమెడియన్ పాత్రలు వచ్చినా మొండిగా తిరస్కరిస్తూ వచ్చిన సునీల్ లాంటి వాళ్లు కూడా ఈ చిత్రంలో ఒక పాత్ర చేస్తాం అంటూ వారంతట వారు వచ్చి అడగడం ‘సైరా’ మ్యానియాను సూచిస్తుంది అంటున్నారు. అయితే మెగా కాంపౌండ్ మాత్రం ఈ ఒత్తిడికి ఏమాత్రం తలఒగ్గకుండా తమ మనసులోని మాటను బయట పెట్టకుండా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది అని టాక్..  


మరింత సమాచారం తెలుసుకోండి: