బాలీవుడ్ దంపతులు మలైకా అరోరా , అర్ఫాజ్ ఖాన్ లు విడాకులు తీసుకుని విడివిడిగా ఉంటున్న సంగతి తెలిసిందే. వీరిద్దరి కొడుకు అర్హాన్ ఖాన్ జన్మదినం సందర్భంగా వీరు మళ్ళీ కలవడం విశేషం. కొడుకు తో కలిసి ఫామిలీ బాగా ఎంజాయ్ చేసారు. అతనితో కేక్ కోయించి సంతోషంగా ఆ వేడుకని చేసుకున్నారు.

ఈ వేడుకను పురస్కరించుకుని మలైకా ఇన్స్టాగ్రామ్ లో ఫొలో అప్ లోడ్ చేసింది. అంతేకాదు, "నా బాబు పెద్దవాడు అయ్యాడు. హ్యాపీ బర్త్ డే మై జాన్" అంటూ కామెంట్ పెట్టింది.

అంతేకాదు, తాము విడాకులు తీసుకున్నా, తమ కుటుంబాల మధ్య సత్సంబంధాలు కొనసాగుతూనే ఉన్నాయని తెలిపింది. తాము విడివిడిగా ఉన్నా... కుమారుడి మంచి చెడ్డలను కలిసే చూస్తామని చెప్పింది.

అయితే బాలీవుడ్ లో డిస్కషన్ లు మాత్రం వారిద్దరూ త్వరలో మళ్ళీ ఒకే ఇంట్లో కాపురం ఉండి తమ కొడుకు కోసం కలిసిపోవాలి అనే ఉద్దేశ్యం తో ఉన్నట్టు చెబుతున్నారు. దీనికోసం ముంబై లో బాంద్రా ఏరియా లో ఒక నివాసం కూడా చూసినట్టు తెలుస్తోంది. మలైకా ప్రస్తుతం ఒంటరిగా ఉంటూ ఉన్నా అర్ఫాజ్ మాత్రం ఒకమ్మాయి తో ఉంటున్నాడు అని టాక్.


మరింత సమాచారం తెలుసుకోండి: