తెలుగు ఇండస్ట్రీలో ఆ ఇద్దరు ఇప్పుడు టాప్ పొజీషన్లో ఉన్న దర్శకులు, మ్యూజిక్ దర్శకులు.  వీరిద్దరి కాంబినేషన్ లో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలు వచ్చాయి. కాకపోతే ఈ మద్య వీరిద్దరి మద్య కాస్త దూరం పెరిగిందని మీడియాలో వార్తలు కోడై కూస్తున్నాయి..ఇందకీ ఆ ఇద్దరు ఎవరా అనుకుంటున్నారా..త్రివిక్రమ్ – దేవిశ్రీ ప్రసాద్.  ఇండస్ట్రీలో ఒకప్పడు వీరిద్దరు మంచి స్నేహితుల్లా ఉండేవారు. 

Image result for devisri prasad trivikram

త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన జల్సా, జులాయి, అత్తారింటికి దారేది, సన్ ఆఫ్ సత్యమూర్తి చిత్రాలకు దేవిశ్రీ అదిరిపోయే ఆల్బమ్స్ అందించాడు. వీరి కాంబినేషన్ లో మరిన్ని చిత్రాలు రావడం ఖాయమని అభిమానులు భావించారు.  ఆ ఇద్దరి మధ్య ఇప్పుడు విబేధాలు రాజ్యమేలు తున్నాయి దానికి నిదర్శనమే త్రివిక్రమ్ పుట్టినరోజు న దేవిశ్రీ ప్రసాద్ ట్వీట్ .

Image result for devisri prasad trivikram

తాజాగా పవన్ కళ్యాణ్ తో త్రివిక్రమ్ చేస్తున్న సినిమాకు తమిళ సంగీత దర్శకుడు అనిరుద్ సంగీతం అందిస్తున్నాడు అలాగే ఎన్టీఆర్ తో చేయబోయే సినిమాకు కూడా అనిరుద్ నే తీసుకున్నారు దాంతో త్రివిక్రమ్ - దేవిశ్రీ ల మధ్య విభేదాలు వచ్చాయని గుసగుసలు వినిపించాయి.  దీనికి ఊతమిచ్చేలా నవంబర్ 7న పుట్టినరోజు జరుపుకుంటున్న మిగతా సెలబ్రిటీ లకు శుభాకాంక్షలు చెబుతూ ట్వీట్ చేసాడు కానీ త్రివిక్రమ్ కు మాత్రం చెప్పలేదు.


 అయితే దేవిశ్రీ ఇండస్ట్రీలో చాల కాలం నుంచి ఉన్నాడు. ప్రేక్షకులు కొత్తదనం కోరుకుంటుండడంతో దేవిని పక్కన పెట్టిన త్రివిక్రమ్ అనిరుద్ పై ఎక్కువగా ఆసక్తి చూపుతున్నాడు. పైగా దక్షిణాదిలో ప్రస్తుతం అనిరుద్ హావా సాగుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: