రామ్ గోపాల్ వర్మ ప్రస్తుతం పరాజయాల బాటలో ఉన్నా పిలిచి వర్మకు నాగార్జున మరో అవకాశం ఇవ్వడం ఒకసంచలనం. ఇదిచాలదు అన్నట్లుగా నాగార్జున అనుసరిస్తున్న విధానాలు వల్ల వర్మ వ్యూహాలకు కలిసివస్తోంది అన్న కామెంట్స్ ప్రస్తుతం వినిపిస్తున్నాయి. నాగార్జున వర్మల కాంబినేషన్ లో రూపొందబోతున్న మూవీ షూటింగ్ ఈనెల 20వ తారీఖు నుండి ప్రారంభం కాబోతోంది. 

నాగ్ ఈసినిమాలో ‘శివమణి’ సినిమా లాంటి పవర్ ఫుల్ పోలీసు ఆఫీసర్ పాత్ర చేస్తున్నట్లు టాక్. అయితే ఈసినిమా షూటింగ్ మొదలు పెట్టాక కేవలం 10రోజులు మాత్రమే షూటింగ్ చేసి ఆతరువాత దాదాపు రెండు నెలలపాటు ఈసినిమా షూటింగ్ కు బ్రేక్ ఇస్తారని తెలుస్తోంది. ఈగ్యాప్ లో నాగార్జున అఖిల్ తో తాను తీస్తున్న ‘హలో’ సినిమా విషయాల ప్రమోషన్ పై దృష్టి పెడతాడని తెలుస్తోంది. 

ఈ గ్యాప్ లో వర్మ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ పనులను చక్కబెట్టేస్తాడనే మాటలు వినిపిస్తున్నాయి. ఎన్టీఆర్ పాత్రను పోషించడానికి అన్నివిధాల సరిపోయే నటుడు వర్మకు దొరికినట్లుగా ప్రచారం జరుగుతోంది. వ్యక్తుల జీవితాల పై వర్మ తీసే సినిమాలలోని పాత్రలను ఎంచుకోవడంలో వర్మ స్టైల్ సూపర్ గా ఉంటుంది. వంగవీటి, వీరప్పన్ వంటి చిత్రాల కోసం ఎంచుకున్న పాత్రధారులు అచ్చుగుద్దినట్లుగా రియల్ లైఫ్ కేరక్టర్లను పోలినట్లుగా చూపించిన విధానం అందర్నీ ఆకట్టుకుంది. ఈపరిస్థుతులలో వర్మ ఎన్టీఆర్ పాత్ర కోసం ఎంపిక చేసిన నటుడు ఇండస్ట్రీకి కొత్తవాడైనా ఈనటుడు చూసేందుకు ఎన్టీఆర్ ను పోలినట్లుగా ఉండడం విశేషంగా చెబుతున్నారు.

ప్రస్తుతం ఇతనికి తన ఆఫీస్ లోనే స్పెషల్ గా వర్మ ట్రైనింగ్ ఇస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఈ నటుడి గురించి ఎలాంటి వివరాలు బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాడట వర్మ. ఈ మూవీ ఫస్ట్ లుక్ తాను అఫీషియల్ గా రిలీజ్ చేసేవరకు ఎన్టీఆర్ పాత్రలో నటించేది ఎవరనే డీటైల్స్ బయటకు రాకుండా ఉండాలని వర్మ తన టీమ్ కు ఆర్డర్ చేసినట్లుగా తెలుస్తోంది..  


మరింత సమాచారం తెలుసుకోండి: