అందాల భామ మెహ‌రీన్ గురించి ఇప్పుడు తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యం అక్క‌ర్లేదు. టాలీవుడ్‌లో ఇప్పుడు ఆమె గోల్డెన్‌గ‌ర్ల్‌గా మారిపోయింది. నాని కృష్ణ‌గాడి వీర ప్రేమ‌గాథ సినిమాతో ఇక్క‌డ ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌యం అయిన ఆమె శ‌ర్వానంద్‌తో మ‌హానుభావుడు, తాజాగా ర‌వితేజ‌తో రాజా ది గ్రేట్ సినిమాల‌తో మూడు వ‌రుస హిట్లు కొట్టి తొలి మూడు సినిమాల‌తోనే హ్యాట్రిక్ హిట్లు త‌న ఖాతాలో వేసుకుంది.

mehreen pirzada కోసం చిత్ర ఫలితం

తాజాగా మెహ‌రీన్ మిస్సింగ్ న్యూస్ కోలీవుడ్ ఇండ‌స్ట్రీలో క‌ల‌క‌లం రేపుతోంది. మెహ‌రీన్ తాజాగా సందీప్‌కిష‌న్ స‌ర‌స‌న C/o సూర్య సినిమాలో న‌టించింది. కోలీవుడ్ డైరెక్ట‌ర్ సుశీంద్ర‌న్ ఈ సినిమాకు ద‌ర్శ‌కుడు. ఈ సినిమా ఈ శుక్ర‌వారం తెలుగు, త‌మిళ భాష‌ల్లో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ఈ సినిమాకు అనుకున్న టాక్ రాలేదు. ఇదిలా ఉంటే ఈ సినిమాలో హీరోయిన్ మిస్సింగ్ వార్త ఇప్పుడు పెద్ద సంచ‌ల‌నంగా మారింది.


C/o సూర్య సినిమాలో మెహ‌రీన్ ఎలా మిస్ అయ్యింద‌ని షాక్ అవుతున్నారా ?  ఈ సినిమా త‌మిళ్ వెర్ష‌న్‌లో హీరోయిన్ మెహ‌రీన్ ఉన్న సీన్లు అన్ని పూర్తిగా డిలీట్ చేశారని తెలుస్తోంది. అక్క‌డ ఈ సినిమాలో 20 నిమిషాల సీన్లు సోమ‌వారం నుంచి ట్రిమ్ చేశారు. అందులో హీరోయిన్ మెహరీన్ సన్నివేశాల్ని పూర్తిగా తొలగించారు. 

mehreen pirzada కోసం చిత్ర ఫలితం

సినిమా టైటిల్స్‌లో మెహ‌రీన్ పేరు ఉన్నా సినిమాలో ఆమె న‌టించిన సీన్లు మాత్రం లేవు. ఈ సీన్లు తీసేముందు ద‌ర్శ‌కుడు ఆమెకు చెప్పిన‌ట్టు టాక్ ? ఇక సినిమా చూసిన వారే ముందే మెహ‌రీన్‌కు ప్ర‌యారిటీ లేద‌ని పెద‌వి విరిచారు. ఇక ఇప్పుడు ఏకంగా త‌మిళ్ వెర్ష‌న్‌లో ఆమె క్యారెక్ట‌ర్ మొత్తం ఎత్తివేయ‌డం కోలీవుడ్‌లో పెద్ద సంచ‌ల‌నంగా మారింది.


మరింత సమాచారం తెలుసుకోండి: