ఈ సినిమా ప్రకటించిన నాటి నుంచే కాంట్రవర్సీలకి కేంద్రం గా మారింది. రామ్ గోపాల్ వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ అని ప్రకటించగానే లక్ష్మీస్ వీరగ్రంధం అంటూ లక్ష్మీ పార్వతి మొదటి మొగుడి జీవితం మీద సినిమాకి పూనుకున్నారు కేతిరెడ్డి.

మొన్నామధ్య ఈ సినిమా ముహూర్తంన్ని హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ దగ్గర చిత్రీకరణ చెయ్యడం కోసం సిద్దం అయ్యింది ఈ బృందం. అయితే దీనిని పోలీసులు అడ్డుకున్నారు.

అనంతరం ఈ చిత్రయూనిట్ ఎన్టీఆర్ స్వస్థలమైన కృష్ణా జిల్లా పామర్రు మండలంలోని నిమ్మకూరులో జరిపేందుకు చేసిన ప్రయత్నాలను ఆ గ్రామ వాసులు అడ్డుకున్నారు.ఎన్టీఆర్ కు సంబంధించిన కొన్ని సన్నివేశాలు చిత్రీకరించేందుకు పంచాయతీ పెద్దలను ఈ సినిమా దర్శకుడు కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి ఆశ్రయించారు.

ఆ ప్రాంత పంచాయతీ పాలకవర్గం, గ్రామ పెద్దలూ కలిసి కూర్చుని మాట్లాడి ఈ సినిమా కారణంగా నిమ్మకూరుకి చెడ్డపేరు వస్తుంది అనీ తాము అనుమతి ఇవ్వలేము అని తెలిపారు. చిత్రయూనిట్ ఎన్టీఆర్ కాంస్య విగ్రహానికి పూలమాలలు వేసి, నివాళులర్పించి, వెనుదిరిగారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: