తెలుగు ఇండస్ట్రీలో ఇప్పటి వరకు ఎంతో మంది స్టార్ హీరోల వారసులు వచ్చారు..వస్తున్నారు.  అక్కినేని నాగార్జున వారసుడిగా ‘జోష్’ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు ఆయన పెద్దకుమారుడు నాగ చైతన్య. ఇక ‘సిసింద్రి’తో చిన్నతనంలోనే వెండితెరపై ఆడుకున్నాడు ఆయన రెండవ కుమారుడు అక్కినేని అఖిల్.   ఇక ఇండస్ట్రీకి చైతూ వచ్చి దాదాపు పది సంవత్సరాలు దాటినా..సక్సెస్ మాత్రం అందుకోలేక పోతున్నాడు. 
Image result for akhil nag family
మాస్ దర్శకులు వివివినాయక్ దర్శకత్వంలో ‘అఖిల్’ చిత్రంలో ఎంట్రీ ఇచ్చాడు యువ హీరో అఖిల్.  ఈ సినిమా భారీ డిజాస్టర్ గా మిగిలిపోయింది.  కాకపోతే ఈ సినిమాతో అఖిల్ మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. తాజాగా అఖిల్ సెకండ్ మూవీ హలో మూవీ పోస్టర్ రిలీజ్ అయ్యింది. దీంతోపాటు టీజర్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేశాడు. 16వ తేదీన విడుదల అవుతుందని చెప్పాడు. అద్బుతంగా ఉంటుందన్నాడు. 
Image result
ఈ పోస్టర్ లీవుడ్ రేంజ్ లో ఫైటింగ్ సీన్ కంపోజ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాను అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై డైరెక్టర్ విక్రమ్ కుమార్ తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే 80శాతం షూటింగ్ కంప్లీట్ అయ్యింది. డిసెంబర్ 22న మూవీ రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నారు. డైరెక్టర్ ప్రియదర్శన్ కుమార్తె కళ్యాణి హీరోయిన్ గా నటిస్తోంది. మొత్తానికి ఫస్ట్ లుక్ కొంచెం డిఫరెంట్ గా ఉండటంతో.. టీజర్ పై అంచనాలు పెరిగాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: