తెలుగు ఇండస్ట్రీలోనే కాదు యావత్ భారత దేశం సినిమా చరిత్రలో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన చిత్రం ‘బాహుబలి2’.  దర్శకధీరుడు రాజమౌళి ఐదు సంవత్సరాలు కష్టపడి తెరకెక్కించిన చిత్రాలు బాహుబలి, బాహుబలి 2.  ఇప్పటి వరకు భారత దేశంలో బాలీవుడ్, కోలీవుడు ఇండస్ట్రీలు తమ సత్తా చాటుతున్న సమయంలో ఓ తెలుగు సినిమా దేశంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో సెన్సేషన్స్ క్రియేట్ చేసింది.

అలాంటి బాహులిని కాన్సెప్ట్ ఒక్క మూడు నిమిషాల్లో మీ కళ్ల ముందు చూపిస్తే..ఎలా ఉంటుందో ఊహించుకోండి.  అవును అది ఇప్పుడు నిజమైంది..జియోరే బాహుబలి పేరుతో చేసిన ఓ గ్రూప్ చేసిన డ్యాన్స్ ఫెర్ఫార్మెన్స్ వారేవా అనిపిస్తోంది. బాహుబలి డైలాగ్స్, సీన్స్ అన్నింటినీ కలిపి ఓ డాన్స్ రూపొందించి ఓ షోలో ప్రదర్శించారు.   

ఒళ్లు జలదరించే విధంగా ఉన్న ఈ డాన్స్ షోను స్టార్ ప్లస్ లో వచ్చే డ్యాన్స్ ఇండియా ప్రోగ్రామ్ లో కింగ్స్ యునైటెడ్ ఇండియా గ్రూప్ చేసింది. స్టేజ్ పై వీళ్లు గాల్లో ఎగురుతున్న తీరు చూసి అందరూ షాక్ అయ్యారు. ఈ వీడియో చూసిన రాజమౌళి సైతం ఫిదా అయినట్లు తెలుస్తుంది.  మూడు నిమిషాల్లో మొత్తం బాహుబలిని తన డ్యాన్స్ తో అదరహో అన్నట్లు చూపించేశారు. జస్ట్ మూడు రోజుల్లోనే 16 లక్షల వ్యూస్ తో రికార్డ్ బ్రేక్ చేస్తున్నాయి. 


మరింత సమాచారం తెలుసుకోండి: