విజ‌య్ న‌టించిన త‌మిళ చిత్రం త‌లైవాపై భారీ అంచ‌నాలున్నాయి. ఏఎల్ విజ‌య్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన సినిమా ఇది. విజ‌య్‌కి ఉన్న ఫాలోయింగ్ త‌మిళ నాట అంతా ఇంతా కాదు. తుపాకి సినిమాతో అది మ‌రింత పెరిగింది. ఆ చిత్రం త‌మిళ నాట రూ.120 కోట్లు సాధించింది. ఈ వ‌సూళ్లు చూసి కోలీవుడ్ నివ్వెర‌పోయింది. రోబో వ‌సూళ్ల‌ను చాలా చోట్ల ఈ సినిమా క్రాస్ చేయ‌గ‌లిగింది. మ‌లేసియాలో ర‌జ‌నీకాంత్‌కి అభిమానులు భారీ సంఖ్య‌లో ఉంటారు. అక్క‌డ కూడా ఈ సినిమా త‌న ప్ర‌తాపం చూపించింది. ఇప్పుడు త‌లైవా రూ.150 కోట్లు సాధించడం ఖాయ‌మ‌ని కోలీవుడ్ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ సినిమాకి త‌మిళ‌నాట ముందునుంచీ పాజిటివ్ గాలి వీస్తోంది. దానికి తోడు విజ‌య్ తుపాకి సినిమాతో మాంఛి ఊపుమీద ఉన్నాడు. బాషా, నాయ‌కుడు ఫార్మెట్‌లో తెర‌కెక్కిన ఈ సినిమా క‌చ్చితంగా ప్ర‌భంజ‌నం సృష్టించ‌డం ఖాయ‌మ‌ని విజ‌య్ అభిమానులు చెబుతున్నారు. ఈ సినిమా తెలుగులో అన్న‌గా రాబోతోంది. మ‌రి ఇక్క‌డ ఎలాంటి ఫ‌లితాన్ని సాధిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: