నిన్న విశాఖపట్నంలో డ్రెజ్జింగ్ కార్పోరేషన్ ప్రవేటీకరణకు వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమానికి సంఘీభావం తెలుపుతూ పవన్ చేపట్టిన ప్రజాయాత్రలో అతడు చేసిన అనేక కామెంట్స్ పై ఇప్పుడు రాజకీయ దుమారం రేగుతోంది. అనేక ప్రముఖ ఛానల్స్ నిన్న రాత్రి పవన్ స్పీచ్ పై లోతైన విశ్లేషణలు చేస్తూ నిన్న రాత్రి సుదీర్ఘ చర్చా కార్యక్రమాలను నిర్వహించాయి.
ఆంధ్రోళ్లు దోచుకున్నారని చెప్పి.. మళ్లీ అదేపని
ఈ నేపధ్యంలో పవన్ నిన్న ఉద్వేగపూరితంగా ఉపన్యాసం చేస్తున్నప్పుడు కొందరు వీరాభిమానులు చేసిన స్లొగన్స్ పై పవన్ ఎవరి ఊహలకు అందని అనూహ్య స్పందన ఇచ్చాడు. పవన్ ఉపన్యాసం జరుగుతున్నప్పుడు కొందరు ‘టిడిపి హఠావో – బిజెపి హఠావో’ అంటూ నినాదాలు చేసారు. దీనిపై పవన్ నవ్వుతూ స్పందిస్తూ హఠావో అనడానికి ఇంకా కొద్ది సమయం ఉంది అంటూ కొన్ని విషయాలను కొన్ని సందర్భాలలోనే మాట్లాడాలి అంటూ తన అభిమానులకు చురకలు వేసాడు. 
గుణపాఠం చెబుతా.
ఇదే సందర్భంలో మరికొందరు వీరాభిమానులు ‘సి ఎం పవన్ కళ్యాణ్’ అంటూ నినాదాలు చేసినప్పుడు వాటి పై కూడ అనూహ్యంగా స్పందించాడు పవన్. 
అటువంటి పొరపాటు స్లొగన్స్ తన వద్ద ఎప్పుడూ చేయవద్దని ఇటువంటి స్లొగన్స్ వల్ల తన అభిమానులకు ఆనందం కలుగుతుందేమో కాని తనకు కలగదు అంటూ కామెంట్ చేసాడు. 

అధికారం ఒక బాధ్యత అనీ తనకు అధికారం లేకపోయినా తన బాధ్యతల నుండి పారిపోను అంటూ మరొకసారి తన నిజాయితీని నిరూపించుకోవడానికి ప్రయత్నాలు చేసాడు పవన్. నిన్న ‘జనసేన’ కార్యకర్తలతో పవన్ మాట్లాడిన మాటలు కూడ వివాదాలకు తెర లేపుతున్నాయి. ఏది ఎలా చూసుకున్నా నిన్న పవన్ చేసిన ఉపన్యాసంలో ఆవేశం తప్ప విధానాల పై ఎటువంటి క్లారిటీ లేదు అన్న ఘాటైన విమర్శలు రేగుతున్నాయి..


మరింత సమాచారం తెలుసుకోండి: