చిన్న సినిమాలను విడుదల చేయడానికి సరి అయిన థియేటర్స్ కూడ దొరకని పరిస్థితులలో చిన్న సినిమాలు ఎప్పుడు విడుదల అవుతాయో ఆసినిమాలు తీసిన దర్శక నిర్మాతలకే తెలియని విచిత్ర  పరిస్థితులలో నేటి చిన్నసినిమాల పరిస్థితి ఉంది. ఇలాంటి వాస్తవాల నేపధ్యంలో  సాధారణంగా చిన్న మీడియం సినిమాలను వీలైనంత త్వరగా అమ్మేసుకోవాలని లాభం సంగతి అలా ఉంచితే పెట్టుబడి వెనక్కు రప్పించేసుకోవాలని  చిన్న నిర్మాతలు తొందరపడుతుంటారు. కానీ కమెడియన్ సప్తగిరిని హీరోగా పెట్టి సినిమాతీసిన నిర్మాత కిరణ్ ఆలోచన డిఫరెంట్ గా ఉండటం ఇప్పుడు టాపిక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారింది.

తెలుస్తున్న సమాచారం మేరకు ‘సప్తగిరి ఎల్‌ఎల్‌బి’ సినిమాను దాదాపు సొంతంగా విడుదల చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈసినిమాను అమ్మకుండా ఏరియాల వారీ సినిమా రేంజ్ కు తగినట్లు అడ్వాన్స్ లు తీసుకుని విడుదల చేస్తున్నారని టాక్. నిజానికి సప్తగిరి కామెడీకి బిసి సెంటర్లలో బాగానే ఆదరణ ఉండటంతో ఈమేరకు ‘సప్తగిరి ఎల్‌ఎల్‌బి’ కి ఆఫర్లు మంచిగానే వచ్చాయని టాక్.

అయినా ఈమూవీని అమ్మకుండా కేవలం అడ్వాన్స్ ల మీద ఈసినిమాను విడుదల చేయడం ఈసినిమా నిర్మాతకు మితిమీరిన ఆత్మా విశ్వాసాన్ని సూచిస్తోంది అంటూ కామెంట్స్ వినపడుతున్నాయి. ‘సప్తగిరి ఎల్‌ఎల్‌బి’ సినిమాకు పబ్లిసిటీ విడుదల ఖర్చులు అన్నీకలిపి ఏడుకోట్ల వరకు అయినట్లు తెలుస్తోంది. ఈసినిమాకు  శాటిలైట్ డీల్ కూడా ఇంకా పూర్తికాలేదు. అలాంటి టైమ్ లో ఎవరైనా సరే సినిమాను అమ్మేసుకోవాలనే అనుకంటారు. కానీ కంటెంట్ బాగా వచ్చిందన్న నమ్మకంతో ఈమూవీ నిర్మాత చేస్తున్న సాహసం వెనుక ఎవరి సలహాలు  ఉన్నాయి  అన్న చర్చలు జరుగు తున్నాయి. 

ఈ సినిమా ఖచ్చితంగా పెద్ద హిట్ అవుతుందని నిర్మాత చాలా నమ్మకంగా చెపుతున్నాడు. అందుకే ఈ సినిమాను కొంటాం అన్నవారిని కూడా ఈ సినిమాను అమ్మకుండా  కేవలం  అడ్వాన్స్ లే ఇవ్వమని అడిగినట్లు తెలుస్తోంది. హిందీలో పెద్ద హిట్ అయిన జాలీ ఎల్‌ఎల్‌బి ఆధారంగా ‘సప్తగిరి ఎల్‌ఎల్‌బి’ సినిమా రూపొందించినా ఈమధ్యకాలంలో మంచి టాక్ వచ్చిన చాలమంచి చిన్న సినిమాలకు కూడ కలెక్షన్స్ లేక థియేటర్స్ వెలవెలబోతున్న నేపధ్యంలో సప్తగిరి ధీమా  ఏమిటో మరికొద్ది గంటలలో నేడు తెలిపోబోతోంది.. 



మరింత సమాచారం తెలుసుకోండి: