తెలుగు ఇండస్ట్రీలో లక్కీ స్టార్...ఎవరూ అంటే వెంటనే చెబుతారు నేచురల్ స్టార్ నానీ అని..ఎందుకంటే ఓ హీరోకి వరుసగా విజయాలు దక్కడం అనేది చాలా అరుదు. మారుతి దర్శకత్వంలో ‘భలే భలే మగాడివోయ్’ చిత్రం తర్వాత నానికి వరుసగా విజయాలు దక్కుతున్నాయి.  ఈ సంవత్సరం నేను లోకల్, నిన్నుకోరి చిత్రాలతో మంచి విజయం అందుకున్న నాని త్వరలో ‘ఎంసిఏ’ (మిడిల్ క్లాస్ అబ్బాయి) తో అభిమానుల ముందుకు రాబోతున్నాడు.  న‌టుడిగా రాణిస్తున్న నాని ఇటీవ‌ల వాల్ పోస్ట‌ర్ అనే ప్రొడ‌క్ష‌న్ సంస్థ స్థాపించి ఈ బేన‌ర్‌పై నిర్మాతగా ‘అ’ అనే సినిమా చేస్తున్నాడు.   
Image result for AWE movie nitya menon
ఈ చిత్రానికి ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహిస్తున్నారు.  ఇందులో శ్రీనివాస్ అవ‌స‌రాల‌,నిత్యామీన‌న్‌,నిత్యామీన‌న్‌ రెజీనా, ఈషా రెబ్బా, ప్రియ‌ద‌ర్శిని లీడ్ పాత్ర‌లు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి నాని, ర‌వితేజ వాయిస్ ఇవ్వ‌డం విశేషం.  ఇప్పటికే ఈ చిత్రం దాదాపు 80 శాతం పూర్తి చేసుకుంది. ఇటీవ‌లే నాని త‌న ట్విట్ట‌ర్ ద్వారా మూవీ ఫ‌స్ట్ లుక్ విడుద‌ల చేశాడు.
Image result
ఆ త‌ర్వాత‌ వాల్ పోస్ట‌ర్ నిర్మాణ సంస్థ త‌మ ట్విట్ట‌ర్‌లో నిత్యా మీన‌న్ ఫ‌స్ట్ లుక్ విడుద‌ల చేశారు.  తాజాగా ఈ చిత్రంలో మరో పోస్టర్ రిలీజ్ చేశారు.  అవసరాల నానికి సంబంధించి ఈ లుక్ చూస్తుంటే..పూర్తి సైంటిఫిక్ చిత్రంలా అనిపిస్తుంది..ఎందుంటే మనోడు పెద్ద  సైంటిస్ట్‌గా కనిపిస్తున్నాడు. ఈ చిత్రానికి కార్తీక్ ఘ‌ట్ట‌మ‌నేని ఛాయాగ్రాహ‌కుడిగా ప‌నిచేస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: