నాచురల్ స్టార్ నాని హీరోగా సూపర్ ఫాంలో ఉండగా ఇప్పుడు కొత్తగా నిర్మాతగా కూడా సత్తా చాటాలని చూస్తున్నాడు. ప్రస్తుతం నాని నిర్మాతగా వాల్ పోస్టర్ సినిమా ప్రొడక్షన్ లో వస్తున్న సినిమా అ!. ప్రశాంత్ వర్మ డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో కాజల్, రెజినా, ఈషా రెబ్బ, నిత్యా మీనన్ నటిస్తున్నారు.


రీసెంట్ గా సినిమాలో నటిస్తున్న కాస్ట్ తో ఫస్ట్ లుక్ రివీల్ చేస్తూ వస్తున్న నాని. ఈరోజు రెజినా లుక్ రివీల్ చేశారు. ఒళ్లంతా ట్యాటూలతో రెజినా లుక్ సర్ ప్రైజ్ చేసింది. ఇన్నాళ్లు హాట్ లుక్స్ తో అదరగొట్టిన రెజినా మొదటిసారి ఓ ప్రత్యేక పాత్రలో నటిస్తుందని అంటున్నారు. బడాస్ పాత్రలో రెజినా లుక్ షాక్ ఇచ్చిందంటే నమ్మాలి.


నాని అ! సినిమా ఒక్క రెజినానే కాదు ఈషా క్యూట్ గా అలరించగా.. నిత్యా మీనన్ తన స్టైల్ తో కనిపించింది. ఇక అవసరాల శ్రీనివాస్ సూర్య 24 సినిమాలో లాగా ఏదో ప్రయోగం చేస్తున్నట్టు కనిపించాడు. మొత్తానికి నాని అ! రెగ్యులర్ సినిమా కాదని ఫస్ట్ లుక్ పోస్టర్స్ చూస్తుంటేనే తెలుస్తుంది.


సినిమాలో ఐదుగురికి ఐదు కథలు ఉంటాయట. ఇక ఇందులో నాని చేపకు వాయిస్ ఓవర్ ఇస్తాడట. మాస్ మహరాజ్ రవితేజ కూడా ఈ సినిమా కోసం వాయిస్ ఓవర్ ఇస్తున్నాడని తెలుస్తుంది. సినిమా షూటింగ్ దాదాపు పూర్తి అయ్యేందుకు రాగా ఫిబ్రవరిలో సినిమా రిలీజ్ అంటున్నారు. మరి నిర్మాతగా పూర్తి స్థాయిలో దిగుతున్న నాని అ! తో ఎలాంటి ఫలితం అందుకుంటాడో చూడాలి.
    


మరింత సమాచారం తెలుసుకోండి: