తమిళ ఇండస్ట్రీలో మాస్ హీరోగా పేరు తెచ్చుకున్న సూర్య తెలుగులో గజిని, సింగం సీరీస్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.  కేవలం నటుడిగానే కాకుండా సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొనే సూర్య తెలుగు హీరోలకు మంచి స్నేహితుడు.  అందుకే సూర్య నటించిన సినిమాలు తెలుగులో కూడా మంచి క్రేజ్ ఉంది.  ప్రస్తుతం సూర్య బాలీవుడ్ లో ఘనవిజయం సాధించిన స్పెషల్ 26 రీమేక్ లో నటిస్తున్నాడు. మాస్ లుక్ లో ఇరగదీసిన సూర్య అభిమానులకు మరో సర్‌ప్రైజ్ ఇచ్చాడు. 

విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను తెలుగులో గ్యాంగ్ పేరుతో రిలీజ్ చేస‍్తున్నారు. ‘దేశంలో సమస్యలను ఈకల్లా పీకి పాడేయొచ్చు.. గుండెల్లో ధైర్యం.. చేతిలో ధర్మం ఉంటే మనం దేనికీ భయపడక్కర్లేదు’ అంటూ సూర్య సీరియస్ గా డైలాగ్స్ కొడుతుంటే..రమ్యకృష్ణ దగ్గుతూ... సూర్య గాలి తీసేయడం చూస్తుంటే సినిమాలో సీరియస్ నెస్ తో పాటు మంచి ఎంట్రటైన్ మెంట్ కూడా ఉన్నట్లు కనిపిస్తుంది. 

తమిళంలో తెరకెక్కిన ‘తానా సెరెంద కూట్టమ్‌’ను తెలుగులో ‘గ్యాంగ్’గా విడుదల చేస్తున్నారు. ‘పోలిసంటే రొటీన్ కదా సర్, ఈ సారి కొత్త ట్రాక్’’ అంటూ... సూర్య తన సినిమాలో తన పాత్రపై అంచనాలు పెంచేశాడు. స్టూడియో గ్రీన్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై కె.ఇ. జ్ఞానవేల్‌ రాజా చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అనిరుధ్‌ సంగీతం సమకూర్చాడు. జనవరి 12న ఈ సినిమా విడుదల కానుంది. ఈ సినిమాకు సూర్యనే సొంతంగానే తెలుగులో డబ్బింగ్ చెప్పుకోవడం మరో విశేషం.



మరింత సమాచారం తెలుసుకోండి: