నరకాసురుని పాలన అత్యంత పాశవికం. వాడు పెట్టిన వేదనలు అనేక సంవత్సరాలు భరించిన భాతర జాతి వాని శ్రికృష్ణ భగవానుడు సత్యా సమేతంగా సంహారించిన తరవాత స్వతంత్ర వాయువులు శ్వాసించి సంతోష తరంగాల్లో ఊయలలూగారు. నరకుని చెరనుండి సాధుజనులు, పదహారువేలమంది రాజకన్యలు విడిపించబడ్డారు తదనతరం దర్మం ప్రత్తిష్టితమైంది. 

salma hayek with harvey weinstein కోసం చిత్ర ఫలితం

అలాంటి చరిత్రే ఈ యుగంలో పునఃప్రదర్శితమైంది. ప్రముఖ హాలీవుడ్‌ నిర్మాత "హార్వే వీన్‌స్టీన్" వందలాదిమంది వనితలను తారామణులను తనను లైంగిక అవసరాలు తీర్చుకోవటానికి వేధించడంతో పాటు చంపేస్తానంటూ కొన్నిసార్లు బెదిరించటం, వీడియోలు బహిర్గతపరుస్తానని బ్లాక్మెయిల్ అనేక సందర్భాల్లో జరిగింది. తనను కూడా మానసికంగా భౌతికంగా వేదించి బెదిరించాడని ఆయన మనిషి కాదు మృగం నటి సల్మా హయక్ తెలిపారు. 


ఇప్పటికే 50కి పైగా నటీమణులు హార్వే వీన్‌స్టీన్‌ లైంగిక వేధింపులు, అత్యాచారాలపై పిడికిలి తెరచి భయం విడిచి నోరు తెరిచి రహస్యం విప్పిన సంగతి తెలిసిందే. ధైర్యంగా ఈ విషయాన్ని వెలుగులోకి తెచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ, "మీ..టూ"  అంటూ వారి బాటలోనే తాను ముందుకు నడిచినట్లు నటీమని సల్మా హయక్ చెప్పారు. 

అతడు మనిషి రూపంలో ఉన్న "మానవ మృగము" అంటూ, వాడొక నరరూప రాక్షసుడు, మాన్-స్టర్  అంటూ ఎందరో మగువల జీవితాలతో ధారుణమైన కిరాతక క్రీడ నడిపించాడని ఆ దుష్టుణ్ణి అత్యంత కఠినంగా శిక్షించాలన్నారు.


మగువలు నాడు అనుభవించిన మూగ రోధనకు శిక్షతో సమాధానం చెప్పాలని అంటున్నారు. ఒక రోజు కాదు ఒక వారం కాదు ఒక మాసం కాదు అనేక సంవత్సరాల తరబడి హర్వే వీన్‌స్టీన్ వేధించాడని ఆమె తాజాగా చేసిన వ్యాఖ్యలు మరెందరికో స్ఫూర్తిగా నిలుస్తాయని అభిప్రాయపడ్డారు. 

salma hayek with harvey weinstein కోసం చిత్ర ఫలితం

"అతడి ముందు స్నానం చేసేందుకు, మసాజ్ చేసేందుకు, నగ్నంగా ఫొటోలు పంపేందుకు, మరో మహిళతో నగ్నంగా సన్ని హితంగా వ్యవహరించేందుకు - ఇలాంటి పనులకు మీరు ఇకనైనా నో చెప్పాలి" అంటూ హార్వే వీన్‌స్టీన్ చర్యలకు వ్యతిరేకంగా ఆమె పిలుపునిచ్చారు.  అతని ఆదేశాలు మన్నించకపోతే తన అశ్లీల వీడియోలు, అశ్లీల చిత్రాలు, ఇంటర్నెట్ లో అప్‌లోడ్ చేసి పరువు ప్రతిష్ఠలకు అంతరాయం కలిగించి అంతు చూస్తానని వేధించేవాడని నటి సల్మా హయక్ చెప్పారు.


సంబంధిత చిత్రం


నటీమణులు కొందరు స్వతంత్రించి భయం వీడి  ధైర్యం చేసి వీన్‌స్టీన్ చీకటి చేస్టలు బహిర్గతం చేయటంతో ప్రస్తుతం ఆ పరిస్తితుల్లో ఎంతో మార్పు వచ్చిందని, బాధిత మహిళలు ఇదే విధంగా తిరుగుబాటు కొనసాగిస్తే వీన్‌స్టీన్‌ లాంటి మానవ మృగాల కిరాతక చర్యల ఆట వేట కట్టించవచ్చని చెప్పారు. ఇంకో వైపు లైంగిక వేధింపుల ఆరోపణ ల్లో ఇరుక్కున్న హాలీవుడ్ నిర్మాత హార్వే వీన్‌స్టీన్‌ పై "అమెరికా నిర్మాతల గిల్డ్‌-పీజీఏ" జీవిత కాల నిషేధం విధించింది.

producers guild of america కోసం చిత్ర ఫలితం


హార్వే వీన్‌స్టీన్‌ ప్రవర్తనపై వెల్లువైన అనేక ఫిర్యాదు లను పరిశీలించిన తదనంతరం పలువురు బాధితునటీమణులు ఇప్పటికీ కూడా తాము పడిన ఇబ్బందులను బట్ట బయలు చేస్తున్న తరుణంలో  ఆయనపై జీవితకాల నిషేధం వంటి చర్య తీసుకుంటున్నట్లు "పీజీఏ" తెలిపింది. 1970 నుంచీ లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారంటూ హార్వే వీన్‌స్టీన్‌పై ఇప్పటికే 50 మంది పై సంఖ్యలో సినీ నటీమణులు ఆరోపణలు చేశారు. చివరకు హార్వే వీన్‌స్టీన్‌ ను "బ్రిటిష్‌ ఫిల్మ్‌ అండ్‌ టెలివిజన్‌ అకాడెమీ" కూడా శాశ్విత బహిష్కరణకు ఆదేశించిన విషయం తెలిసిందే.

salma hayek with harvey weinsten కోసం చిత్ర ఫలితం

మరింత సమాచారం తెలుసుకోండి: