టాలీవుడ్ లో జర్నీ సినిమాతో హీరోయిన్ గా మంచి క్రేజ్ తెచ్చుకున్న అంజలి ఆ తర్వాత ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ తో అచ్చమైన తెలుగు అమ్మాయిగా తెగ సందడి చేసింది.  ఆ తర్వాత వచ్చిన సినిమాలు పెద్దగా విజయం కాలేదు. అయితే తెలుగులోనే కాకుండా తమిళ, మళియాళ ఇండస్ట్రీలో కూడా అంజలి మంచి పేరు తెచ్చుకుంది.  ఇక తమిళ ఇండస్ట్రీకి వెళ్లిన తర్వాత అజంలి కాస్త బొద్దుగా తయారు కావడంతో సినిమా చాన్సులు తగ్గాయి.  ఈ మద్య గీతాంజలి సినిమాలో ద్విపాత్రాభినయంలో కనిపించి అంజలి ‘సరైనోడు’ లో ఐటమ్ సాంగ్ లో నటించింది. 
ఈ హీరోయిన్ ఎంత స్లిమ్ గా మారిందో చూడండి..!
తెలుగు లో ఈ అమ్మడికి సినిమాలు అసలు లేవనే చెప్పొచ్చు.  ఇక లాభం లేదనుకున్న అంజలి గత కొంత కాలంగా సినిమాలకు దూరంగా ఉంటూ వస్తుంది..అయితే ఈ అమ్మడు తన ఫిట్ నెస్ కోసం తెగ కష్టపడినట్లు తెలుస్తుంది.  తన ట్విట్టర్ లో రీసెంట్ గా తీయించుకున్న ఫోటోస్ అప్ లోడ్ చేసింది.  ఇప్పుడు ఆమెను చూసిన వాళ్లు మన అంజలియేనా? అంటూ ఆశ్చర్యంతో నోరెళ్లబెట్టవలసిందే.

ఈ హీరోయిన్ ఎంత స్లిమ్ గా మారిందో చూడండి..!
ఇప్పుడు అంజలి సన్నబడిన ఫోటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఆ ఫోటో లో అంజలి తన సన్నిహితులతో సరదాగా కనబడుతుంది. తమిళ, మలయాళ సినిమాలతో బిజీగా ఉన్న అంజలి.. త్వరలోనే మంచి తెలుగు సినిమా చేయాలని ఆరాటపడుతోంది. తన మాతృ భాషలో బిజీ కావాలని కోరుకుంటోంది.
Image result for అంజలి స్లిమ్ apherald
అంజలి అలా కోరుకునే.. ఇలా బాగా ఫిట్నెస్ సాధించి అందరికి షాక్ ఇచ్చింది. ఇక తెలుగులో బాగా బిజీగా మారాలనే ట్రయల్స్ లో భాగంగానే.. ఇలాంటి స్టిల్స్ ని సోషల్ మీడియాలో విడుదల చేస్తోందని.. నాజూగ్గా తయారవుతోందని.. కోలీవుడ్ జనాలు చెవులు కొరుక్కుంటున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: