టాలీవుడ్ ప్రిన్స్ మ‌హేష్‌బాబుతో హీరోయిన్‌గా చేసిన స‌మంతా, ఇప్పుడు ఆ హీరోతోనే ఐటెం సాంగ్ చేసేంత క‌ర్మ ప‌ట్టిందా అంటే ఏమో కావ‌చ్చు అంటున్నారు టాలీవుడ్ వాసులు. మేట‌ర్ ఏంటంటే దూకుడు,సీత‌మ్మ వాకిట్లో సిరిమ‌ల్లె చెట్టు మూవీల‌లో మ‌హేష్‌,స‌మంతాల జోడి అభిమానుల‌ను మురిపించింది. దూకుడు సీక్వెల్‌లో స‌మంతాకు చోటు ద‌క్కుతుంద‌నుకుంటే ఆ ఛాన్స్ త‌మ‌న్నా కైవ‌సం చేసుకుంది. దూకుడు సీక్వెల్‌లో స‌మంతా లేకుంటే ఆ మూవీకు నిషా ఎలా వ‌స్తుంద‌ని భావించారో లేదో, దూకుడు సీక్వెల్‌లోనూ స‌మంతాతో ఓ స్పెష‌ల్ సాంగ్‌ను పెట్టాల‌ని యూనిట్ అనుకుంటుందట‌.

ఇందుకు స‌మంతా ఒప్పుకుంటుందో,లేదో అని అంద‌రూ అనుకుంటున్నారు. మ‌హేష్‌,స‌మంతాల‌పై ఓ స్పెష‌ల్ సాంగ్ పెట్టాల‌నే ఆలోచ‌న శ్రీనువైట్ల మ‌దిలో ఉందిగాని, ఈ విష‌యం స‌మంతా చేత‌ ఎలా ఒప్పించాల‌నే మేట‌ర్‌ను మాత్రం ఏ విధంగా డీల్ చేయాలో తెలియ‌టంలేదు. స‌మంతాను ఒప్పించే ప‌ని మ‌హేష్‌కే వ‌దిలేద్దాం అని ట్రయ‌ల్స్ వేస్తున్నారు.

స్పెష‌ల్ సాంగ్ అంటే స్పెష‌ల్ ఎప్పిరియ‌న్స్‌నా, లేక ఐటెం సాంగ్‌నా అనే క్లారిటి మాత్రం ఇంకా బ‌య‌ట‌కు రాలేదు. నెం.1 మూవీ త‌రువాత ఆగ‌డు మూవీను శ‌ర‌వేగంగా పూర్తిచేయాలని మ‌హేష్‌ శ్రీనువైట్లను ఆదేశించాడ‌ట‌. అందుకే ఆగడు మూవీకు సంబంధించిన ప్రి ప్రొడ‌క్షన్ వ‌ర్క్‌ను చ‌కాచ‌కా ఫినిష్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: