అక్కినేని కోడలిగా అడుగుపెట్టిన సమంత మునుపటి ఇమేజ్ కన్నా అక్కినేని కోడలిగా ఎక్కువ బాధ్యతను మోయాలని చూస్తుంది. ప్రస్తుతం సినిమాల్లో నటించడం కన్నా నిర్మించేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్టు తెలుస్తుంది. అందులో భాగంగానే కన్నడ యూటర్న్ సినిమాను తెలుగు రీమేక్ చేయాలని చూస్తుంది సమంత. 


ఇక ఈ సినిమాలో ఎవరు నటిస్తారు అన్నది తెలియలేదు. అక్కినేని ఫ్యామిలీ అన్నపూర్ణ బ్యానర్ నుండి సినిమాలు చేస్తుంది. అది కాకుండా ఇప్పుడు కొత్తగా మనం ఎంటర్టైన్మెంట్స్ అని పెట్టారు. ఇది కేవలం అక్కినేని హీరోల కోసమని అన్నారు. అది సరిపోదు అన్నట్టు ఇప్పుడు సమంత కూడా కొత్త బ్యానర్ అంటుంది. 


ఈ బ్యానర్ లో నాగ చైతన్య హీరోగా సినిమాలు చేస్తుందట. అంతేకాదు చైతుని స్టార్ చేయడమే ముఖ్య ఉద్దేశమని తెలుస్తుంది. సౌత్ లో టాప్ హీరోయిన్ అయిన సమంత మొదటి సినిమా హీరో నాగ చైతన్య. అయితే తన భర్తకి మాస్ ఫాలోయింగ్ తీసుకు రావాలని చూస్తుంది సమంత. అందుకే సమంత గైడెన్స్ లో సినిమాలు చేయాలని చూస్తున్నాడట.   


ప్రస్తుతం చేస్తున్న చందు మొండేటి సవ్యసాచి సినిమా కచ్చితంగా చైతుకి మంచి ఇమేజ్ తెచ్చి పెడుతుందని అంటున్నారు. ఇక ఇదే కాకుండా మారుతి డైరక్షన్ లో శైలా రెడ్డి అల్లుడు సినిమా మీద కూడా పక్కా హిట్ అంటున్నారు. వరుస హిట్లతో మారుతి మంచి ఫాంలో ఉన్నాడు మరి ఈ సినిమా చైతుకి ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి. 



మరింత సమాచారం తెలుసుకోండి: