నాచురల్ స్టార్ నాని తన వరుస సక్సెస్ ల హవా కొనసాగిస్తున్నాడు. ఈ గురువారం నాని ఎం.సి.ఏ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా అంచనాలను అందుకోకున్నా సరే నాని రేంజ్ కలక్షన్స్ వసూళు చేస్తుంది. మొదటి రోజే 7.71 కోట్ల కలక్షన్స్ తో సినిమా హంగామా చేసింది. 


ఇక ఈ సినిమా ప్రమోషన్స్ లో బీభత్సంగా పాల్గొన్న నాని తన లైఫ్ లో జరిగిన ఓ ఫన్నీ ఇన్సిడెంట్ గురించి చెప్పుకొచ్చాడు. మీరెప్పుడైనా పోలీసుల చేతుల్లో దెబ్బలు తిన్నారా అంటే.. సత్యం థియేటర్ లో ఓ స్టార్ సినిమా టికెట్ల కోసం రెండో లైన్ కట్టడంతో పోలీసులు కొట్టారని ఆ లైన్ లో తాను దెబ్బలు తిన్నానని అన్నాడు. 


ఇక ఎస్.ఆర్ నగర్ నారాయణ కాలేజ్ లో కూడా తన స్నేహితుడు చేసిన తప్పు వల్ల తాను తన్నులు తినాల్సి వచ్చిందని చెప్పాడు నాని. నాని హీరోగా వరుస సక్సెస్ లను అందుకోవడం కెరియర్ సంతృప్తి కరంగా ఉందని అంటున్నాడు. కథ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూ తన సినిమాతో అందరిని ఎంటర్టైన్ చేస్తున్న నాని ప్రస్తుతం మేర్లపాక గాంధి డైరక్షన్ లో కృష్ణార్జున యుద్ధం సినిమా చేస్తున్నాడు. అది పూర్తి కాగానే మరో రెండు సినిమాలు లైన్ లో పెట్టాడు నాని. నాని రానున్న సినిమాలతో కూడా ఇదే రేంజ్ ఫలితాలను అందుకోవాలని కోరుకుందాం. 



మరింత సమాచారం తెలుసుకోండి: