టాలీవుడ్ లో అతి కొద్ది సమయంలో మంచి పేరు సంపాదించుకున్న తారలలో రకుల్ ప్రీత్ సింగ్ ఒకరు.కెరటం సినిమాతో తెర్రంగేటం చేసినా ఆశించిన స్థాయిలో ఫలితం రాలేదు ,ఈ మధ్యలో అడపాదడపా తమిళ సినిమాలు చేసిన అక్కడ కూడా అంతగా ప్రభావాన్ని చుపించలేకపోయాయి .ఇక వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ తో తెలుగులో బోణి కొట్టిన రకుల్ ఇక వెనక్కి తిరిగిచూస్కొలేదు ,అనతికాలం లోనే స్టార్ హీరోయిన్గా ఎదిగి దాదాపు అందరు అగ్ర హీరోల సరసన నటించింది .

Image result for rakul preet singh

మామూలుగా ఈకాలం యువ కథానాయికలు అందరు ఏచిన్న విషయాన్ని  అయినా సోషల్ మీడియా ద్వారా తమ అభిమానులతో పంచుకుంటూ ఉంటారు , రకుల్ కూడా ఇందుకు మినహాయింపు కాదు .తనకు సంబందించిన ప్రతీవిషయాన్ని అభిమానులతో పంచుకోవడం, అభిమానులతో టచ్ లో ఉండటం రకుల్ కు అలవాటే.2017 వ సంవత్సరంలో చాలా బిజీషెడ్యూల్ తో గడిపిన రకుల్ కు ఆశించిన స్థాయిలో ఫలితం రాలేదు .స్పైడర్ ,విన్నర్ మినహా మరే ఇతర సినిమాలు బాక్సాఫీస్ వద్ద ప్రభావాన్ని చుపించాలేకపోయాయి .

  Related image

ఇక విషయానికి వస్తే ఈ సంవత్సరం మొత్తం బిజీగా గడిపిన రకుల్ కొత్తసంవత్సరం వేడుకలని మాత్రం జాగ్రత్తగా ప్లాన్ చేసింది .గోవా లో ఈసారి  కొత్తసంవత్సరం వేడుకలని జరుపుకోవడానికి బయలుదేరింది.తను గోవాకి బయలుదేరుతున్న సమయంలో విమానం నుండి వీడియో తీసి ఈ మొత్తం తతంగాన్ని తన ఇంస్టాగ్రమ్ అకౌంట్లో  పోస్ట్ చేసింది .


తను ఎవరితో సెలేబ్రేషన్స్ చేసుకోనబోతుంది ,ఎవరు పాల్గొంటున్నారు అనే విషయాన్నీ మటుకు గోప్యంగా ఉంచింది ,సో అవి అన్ని తెలుసుకోవాలంటే మరికొన్ని రోజులు ఆగక తప్పదు . మీలో ఎవరైనా గోవా లో న్యూఇయర్ వేడుకలను చేస్కుంటున్నారా..?అయితే రకుల్ కనపడుతుందేమో మీ అదృష్టాన్ని పరీక్షించుకోండి !

 

మరింత సమాచారం తెలుసుకోండి: