ఒకప్పుడు తెలుగు ఇండస్ట్రీలో ఎంతో పాపులారిటీ సంపాదించిన చిత్రం గులేబకావ‌లి.  ఇప్పుడు ఇదే టైటిల్ పై ప్రముక కొరియోగ్రాఫర్, డైరెక్టర్, నటుడు ప్రభుదేవ, హన్సిక జంటగా ఫుల్ లెన్త్ కామెడీ, యాక్షన్ తరహా చిత్రంగా వస్తుంది  ‘గులేబకావలి’.  ఈ చిత్రంలో ప్రభుదేవ అద్భుతమైన డ్యాన్స్ తో పాటు నటన కూడా కనబరిచారట. 

క‌ల్యాణ్ ద‌ర్శ‌కత్వంలో వస్తున్న 'గులేబకావ‌లి' పూర్తి తరహా ఎంట్రటైన్ మెంట్ గా తెరకెక్కుతున్న నేపథ్యంలో చిత్రానికి సంబంధించిన ట్రైలర్ రిలీజ్ అయ్యింది.   ఈ చిత్రానికి వివేక్ మార్విన్ సంగీత‌మందించారు. 

సీనియర్ నటి రేవతి ఓ కీలక పాత్రలో కనిపించబోతుందట.  ఈ చిత్రంతో ప్రభుదేవ మరో అద్భుతమైన విజయం సాధింస్తారని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.  అంతే కాదు ట్రైలర్ చూస్తుంటే..ప్రభుత్వ, హన్సికల కామెడీ మామూలుగా లేదు.  సంక్రాంతి కానుక‌గా ఈ సినిమా తెర‌పైకి రానుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: