గంగోత్రి సినిమాతో హీరోగా పరిచయమైన అల్లు అర్జున్ హీరోగా తన కాళ్ల మీద తాను నిలబడగలిగాడు. సినిమా సినిమాకు తన రేంజ్ పెంచుకుంటూ వచ్చిన అల్లు అర్జున్ అలియాస్ బన్ని సినిమా కోసం ఎంత కష్టమైనా నేను రెడీ అన్నట్టు కనిపిస్తున్నాడు. ఎందుకు అంటే న్యూ ఇయర్ గిఫ్ట్ గా బన్ని వక్కంతం వంశీ కాంబోలో వస్తున్న నా పేరు సూర్య టీజర్ తో ఒక్కసారిగా డబుల్ ఇంపాక్ట్ వచ్చేలా చేశాడు స్టైలిష్ స్టార్.


ఓ సీరియస్ సోల్జర్ గా బన్ని అదరగొట్టాడని చెప్పొచ్చు. సినిమా టీజరే ఈ రేంజ్ లో ఉంటే ఇక వంశీ సినిమాను ఇంకెంత హై వోల్టేజ్ లో తెరకెక్కించాడో తెలుస్తుంది. బన్ని కెరియర్ లో ఇంత హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ రాలేదని చెప్పాలి. టేకింగ్ కూడా ఫస్ట్ క్లాస్ గా అనిపిస్తుంది. సినిమాలో బన్ని యాటిట్యూడ్ హైలెట్ అయ్యేలా ఉంది.


యాంగర్ సూర్యగా అల్లు అర్జున్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తాడని అంటున్నారు. సినిమాలో అల్లు అర్జున్ కు విలన్ గా యాక్షన్ కింగ్ అర్జున్ నటిస్తున్నాడు. ఫస్ట్ ఇంపాక్ట్ టీజర్ లో అతన్ని రివీల్ చేయలేదు. అను ఇమ్మాన్యుయెల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను లగడపాటి శ్రీధర్ నిర్మిస్తున్నారు. సహనిర్మాతగా బన్ని వాసు ఉండగా.. నాగబాబు ఈ సినిమాకు సమర్పకుడిగా ఉన్నారు.


సరైనోడులో కెరియర్ లో మొదటిసారి సీరియస్ యాక్షన్ చూపించిన బన్ని. ఆ సినిమాతో కెరియర్ లో బెస్ట్ హిట్ అందుకోగా ఆ తర్వాత యాంగర్ సోల్జర్ గా ఇప్పుడు మరింత అంచనాలతో వస్తున్నాడు. మరి బన్ని మార్క్ సినిమాకు కాస్త భిన్నంగా వస్తున్న నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా ఎలాంటి సంచలనాలకు కేంద్ర బిందువుగా మారుతుందో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: