పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తున్న కత్తి మహేష్ ను టార్గెట్ చేస్తూ ట్వీట్ చేసిన పవన్ వ్యక్తిత్వంలో నిన్ను ఓడించలేని వాళ్లు కులం, ధనం, వర్ణం అంటూ మాట్లాడుతారని అన్నాడు. అయితే దీనికి కౌంటర్ గా మళ్లీ పవన్ మీద వ్యంగ్యాస్త్రం సంధించాడు కత్తి మహేష్. ధనం, కులం, వర్ణం గురించి మాట్లాడేది నీ ఫ్యాన్స్, ఫెండ్స్, గర్ల్ ఫ్రెండ్.. నేను కాదు ముందు పెట్టే గడ్డేదో వాళ్లకి పెట్టు అన్నాడు.


అంతేకాదు వ్యక్తిత్వం గురించి ఇక నువ్వు మాట్లాడకుంటే ఉంటే బెటర్.. అనవసరంగా కడుపు చించుకుంటే కాళ్లె మీద పడుతుంది.. జాగ్రత్త అంటూ ఘాటైన రిప్లై ఇచ్చాడు పవన్ కళ్యాణ్. రోజు రోజుకి పవన్ మీద కత్తి మహేష్ వ్యాఖ్యలు మరి శృతిమించుతున్నాయని చెప్పొచ్చు. మరి దీని పర్యావసానాలు ఎలా ఉంటాయో తెలియదు కాని కేవలం పవన్ ను మాత్రమే టార్గెట్ చేసి కత్తి మహేష్ చేస్తున్న కామెంట్స్ హాట్ న్యూస్ గా నిలుస్తున్నాయి.


ఇక నిన్న నందమూరి బాలకృష్ణను కూడా టార్గెట్ చేస్తూ కామెంట్లు చేశాడు కత్తి మహేష్. తానేదో రాజులా ఫీల్ అయ్యే బాలకృష్ణ ప్రజా ప్రతినిధి అయ్యుండి ప్రజలను కొట్టడం ఏంటని అన్నాడు కత్తి మహేష్. ఇన్నాళ్లు మెగా అభిమానులకే కాకుంటే నందమూరి అభిమానుల ఆగ్రహానికి కారకుడవుతునాడు కత్తి మహేష్.



మరింత సమాచారం తెలుసుకోండి: