మనిషన్నాక ప్రేమలు – ద్వేషాలు మామూలే..! సాధారణ మనుషుల ప్రేమల గురించి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అయితే సెలబ్రిటీల లవ్ స్టోరీలంటే మాత్రం సొసైటీకి చాలా ఆసక్తి ఉంటుంది. ఇప్పటివరకూ మనం ఎంతో మంది సెలబ్రిటీల లవ్ స్టోరీస్ విని ఉంటాం. అయితే రజనీకాంత్ లవ్ స్టోరీ మాత్రం ఎవరికీ తెలీదు. ఆయన కూడా ఎప్పుడూ చెప్పలేదు.

Image result for RAJINIKANTH FIRST LOVE

రజనీకాంత్ .. పేరు వింటే చాలు చాలామందికి రోమాలు నిక్కబొడుచుకునేంత అభిమానం వెల్లువెత్తుతుంటుంది. తమిళనాడులో ఆయన ఏం చెప్తే అదే వేదం అన్నట్టు కొంతమంది అభిమానులు ప్రవర్తిస్తుంటారు. ఇప్పుడాయన రాజకీయాల్లోకి వస్తున్నట్టు ప్రకటించారు. ఇప్పటికే సినిమాల ద్వారా సూపర్ స్టార్ గా వెలుగొందుతున్న ఆయన రాజకీయాల్లోనూ తన సత్తా చాటేందుకు ముందుకొస్తున్నారు. దీంతో ఆయనపై అటెన్షన్ మరింత పెరిగింది.

రజనీకాంత్ సినిమాలు, సమాజం గురించి తప్ప వ్యక్తిగత, కుటుంబ విషయాల గురించి మాట్లాడడం చాలా తక్కువ. అయితే ఓ కార్యక్రమంలో మాత్రం ఆయన పర్సనల్ విషయాలను షేర్ చేసుకున్నారు. అదీ తన ఫస్ట్ లవ్ గురించి..! టీనేజ్ లవ్ గురించి ఆయన్ను ఓ ప్రశ్న అడిగినప్పుడు తనకూ ఆ ఏజ్ లో ఓ లవ్ స్టోరీ ఉందన్నారు. హైస్కూల్ లో ఉన్నప్పుడు ప్రేమలో పడ్డానన్న ఆయన.. ఆమె మాత్రం తనకు దక్కలేదన్నారు. చాలా మంది ఫస్ట్ లవ్ ను గెలుచుకున్నారని, నేను మాత్రం ఫెయిలయ్యానని రజనీకాంత్ చెప్పుకొచ్చారు. అయితే ఆమె పేరు చెప్పడానికి మాత్రం రజనీకాంత్ నిరాకరించారు.

Image result for RAJINIKANTH FIRST LOVE

మీ చిన్నకోరికేంటి అన్న ప్రశ్నకు.. ఓ స్కూటర్ కొనుక్కొని ఓ చిన్న ఇల్లు కొనుక్కోవడమే తన చిన్న కోరికన్నారు సూపర్ స్టార్. అలాగే నా సినిమాల ద్వారా ప్రజలు, అభిమానులకు మంచి సందేశాలిస్తూ వారి ముఖాల్లో చిరునవ్వు చూడాలనుకోవడమే తన పెద్ద కోరికన్నారు. ఇలా.. రజనీకాంత్ తన లవ్ మ్యాటర్స్ చెప్పేసరికి సభ అంతా కరతాళధ్వనులతో మార్మోగింది.


మరింత సమాచారం తెలుసుకోండి: