ఇప్పటిదాకా వైవిధ్యంగా, పక్కా ప్లాన్డ్ గా తన కెరియర్ ను తీర్చిదిద్దుకుంటూ వచ్చిన హీరో నాగార్జున ఇఫ్పుడు బోలెడు కన్ఫ్యూజన్లో పడ్డాడట. కెరియర్ ప్రారంభం నుంచీ కూడా పక్కా ప్లానింగ్ తో సినిమాలు చేసుకుంటూ వచ్చాడు నాగార్జున. అందువల్లే బాలకృష్ణ, వెంకటేష్ వెనకపడ్డా, నాగార్జన ఇంకా హీరోగా కొనసాగుతున్నాడు. కానీ ఇటీవల అతగాడి ప్రయోగాలు వికటించాయి. ఢమరుకం, రాజన్న, గగనం, గ్రీకువీరుడు సినిమాలు జనాల్ని ఆకట్టుకోలేకపోయాయి. దీంతో ఏ తరహా సినిమా చేస్తే తనకు సూటవుతుందా అన్న దాంట్లో క్లారిటీ రాక ఇబ్బంది పడుతున్నాడు అందువల్లే ఎవరు ఏ కథ చెప్పినా అంతగా నచ్చడం లేదని తెలిసింది. ప్రస్తుతానికి భాయ్ సిద్ధం అయింది. మనం పూర్తికావాలి. ఇప్పుడు కొంచెం గ్యాప్ వుంది కాబట్టి మరొ సినిమా లాగించవచ్చు. కానీ అదేమిటన్నదే డిసైడ్ చేసుకోలేకపోతున్నాడు. మరోపక్క కొడుకులిద్దరి కెరియర్ ప్లానింగ్  బాధ్యత కూడా నాగ్ పైనే వుంది.వారి కోసం కథలు వినాలి. దర్శకులను ఎంపిక చేయాలి. మరోపక్క అన్నపూర్ణ స్టూడియో ఆధునీకరణ, ఫిల్మ్ ఇన్ స్టిట్టూట్ పనులు వున్నాయి. వీటన్నింటి నడుమ తన కెరియర్ కు సమయం కేటాయించలేకపోతున్నాడు,.

మరింత సమాచారం తెలుసుకోండి: