నిజ జీవితంలోనూ, రీల్ లైఫ్‌లోనూ షారుఖ్ లైఫ్ స్టైల్ చాలా డిప్రెంట్‌. ఇది షారుఖ్‌ఖాన్‌ను ద‌గ్గర నుండి చూసిన వాళ్ళు చెప్పిన మాట‌. అంతే కాకుండా బుల్లితెర నుండి స్టార్‌డం హీరోగా ఎదిగిన షారుఖ్‌, త‌న మూవీను ఏ విధంగా ప్రమోష‌న్ చేయాలో, ఎంటైర్ ఇండియ‌న్ ఫిల్మ్ ఇండ‌స్ట్రీలో షారుఖ్‌కు తెలిసినంతగా ఎవ‌రికి తెలియ‌దు. రీసెంట్ గా జ‌రిగిన ప‌లామ్ సారీస్ లాంచ్ ఈవెంట్‌లో దీపికాప‌దుకొనె,షారుఖ్ అటెండ్ అయ్యారు. ఇద్దరూ శారీలు క‌ట్టుకుంటూ ఒక‌రికొరు ఇబ్బందులు ప‌డ్డారు.

షారుఖ్ కి శారి క‌ట్టుకోవ‌డం రాకోవ‌పోడంతో, దాన్నే లుంగీగా క‌ట్టిన‌ట్టు క‌ట్టేశాడు. ఇదిలాఉంటే చెన్నెఎక్స్‌ప్రెస్ మూవీ ఆగ‌ష్టు 9న రిలీజ్ అవుతుంది. ఈ మూవీ ప్రమోష‌న్ కోసం షారుఖ్ ఒక రోజు ముందుగా మూవీను హైప్ క్రియోట్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడట దీనికి సంబంధించిన ప్రమోష‌న్ సీక్రెట్స్‌ను జూమ్ టెలివిజ‌న్ టెలికాస్ట్ చేసింది. చెన్నెఎక్స్ మూవీలోని ఒక సీన్‌లో షారుఖ్ లుంగిను వ‌దిలేసి శారి కట్టుకోవాల్సిన అవ‌స‌రం ఏర్పడుతుంద‌ట‌. దానికి సంబంధించిన ఫ‌న్నీ క్లిప్స్‌ను, సీన్ మేకింగ్‌ను యూ ట్యూబ్‌లో భారీగా ప్రమోష‌న్ చేయ‌టానికి ప్లాన్ చేసుకున్నట్టు స‌మాచారం.

ఈ ర‌క‌మైన కామెడీను డైరెక్టర్ రోహిత్‌శెట్టి క్రియోట్ చేశాడ‌ని షారుఖ్ ఇది వ‌ర‌కే చెప్పాడు. మొత్తానికి షారుఖ్ శారీ స్టైల్ చెన్నె ఎక్స్‌ప్రెస్ మూవీకే హైలెట్ అని బి-టౌన్ స‌మాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: