ప‌వ‌ర్‌స్టార్ పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తోన్న అజ్ఞాతవాసి మంగ‌ళ‌వారం రాత్రి నుంచే ప్ర‌పంచ‌వ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ అయ్యింది. ఈ సినిమాకు ఏపీలో మంగ‌ళ‌వారం అర్ధ‌రాత్రి నుంచే ప్రీమియర్ల‌తో పాటు పండ‌గ మూడు రోజులే కాకుండా వారం రోజుల పాటు రోజుకు ఏకంగా 7 షోలు వేసుకునేందుకు ప్ర‌త్యేక అనుమ‌తులు ఇచ్చింది.  తెలంగాణ‌లో భ‌ద్ర‌తా కార‌ణాల రీత్యా ప్రీమియ‌ర్ల‌కు అనుమ‌తులు లేక‌పోయినా బుధ‌వారం ఉద‌యం నుంచే షోలు ప‌డ‌నున్నాయి. 

Related image

ఇక ఈ సినిమాలో సీనియ‌ర్ హీరో విక్ట‌రీ వెంక‌టేష్ రోల్ గురించి పెద్ద ఎత్తున చ‌ర్చ జ‌రుగుతోంది. సినిమాలో వెంకీ రోల్ ఎలా ఉంటుంది ?  ఎన్ని నిమిషాలు ఉంటుంద‌నేది కాస్త ఆస‌క్తిగానే మారింది. అజ్ఞాత‌వాసిలో వెంకీ రోల్ గురించి మ్యాట‌ర్ బ‌య‌ట‌కు వ‌చ్చేసింది. సినిమా రెండో భాగంలో వెంకటేష్ చేసిన సీన్ రానుందని సమాచారం. ఒక యాక్షన్ ఎపిసోడ్ లో పవన్ తో పాటు వెంకటేష్ జతకట్టబోతున్నాడు. దాదాపు 3 నిమిషాలపాటు ఉండే ఈ సీన్ ప్రేక్షకులను కనువిందు చెయ్యబోతోంద‌ని తెలుస్తోంది. 

Image result for venkatesh

ఇక సినిమాలో హైలెట్స్ విష‌యానికి వ‌స్తే ప‌వ‌న్ పాడిన కొడకా కోటేశ్వర్ రావ్ పాట సినిమాకు మరో హైలెట్ అవ్వనుందని తెలుస్తోంది. ప‌వ‌న్ స‌ర‌స‌న ఇద్ద‌రు ముద్దుగుమ్మ‌లు అయిన కీర్తి సురేష్‌, అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. హారిక అండ్ హాసిని క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై ఎం.రాధాకృష్ణ (చిన‌బాబు) నిర్మిస్తోన్న ఈ సినిమాకు కోలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ అనిరుధ్ మ్యూజిక్ ఇస్తున్నాడు. ఇక అజ్ఞాత‌వాసి పూర్తి టాక్ మరి కొద్ది గంట‌ల్లోనే తెలిసిపోనుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: