పవన్ కళ్యాన్ — త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న ‘అజ్ఞాతవాసి’ సినిమా మరి కొన్ని గంటల్లో ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కి సిద్దం అవుతుంది.  ఇప్పటికే పలు చోట్ల బెనిఫిటె షోలు కూడా పడ్డాయి. సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి..ఎక్కడ చూసినా పవన్ మానియా కనిపిస్తుంది.  అయితే ‘అజ్ఞాతవాసి’ సినిమాలో పవన్ పాడిన పాట ‘కొడకా కోటేశ్వర్రావు’ ఎంత పాపులర్ అయ్యిందో కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు.  గత నెల 31 న ఈ పాట రిలీజ్ చేశారు..అప్పటి నుంచి సోషల్ మీడియాలో ఈ పాట జోరందుకుంది.  అంతే కాదు విదేశాల్లో సైతం ఆ పాటకు మంచి ఆదరణ లభించింద.  

 మాస్‌కు పవన్ పండుగే

మన బాష తెలియని కుర్రాళ్లుకూడా పవన్ కళ్యాణ్ పాడిన పాటకు ఫిదా అవుతున్నారు..ఇక పోలాండ్ కుర్రోడు పాడిన పాటకు పవన్ కళ్యాన్ సైతం సంతోషంలో మునిగిపోయారు.  అలాంటిది ఇప్పుడు ‘కొడకా కోటేశ్వర్రావు’ పాట తొలగించాలని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ పాట వల్ల తెలుగు రాష్ట్రాల్లో ఉన్న కోటేశ్వ‌ర‌రావుల పరువు పోతోందని, కోటేశ్వ‌ర‌రావు పేరుగ‌ల వారి మ‌నోభావాలు దెబ్బ‌తింటున్నాయని.... విజయవాడకు చెందిన కోటేశ్వ‌ర‌రావు అనే న్యాయ‌వాది ఈ పాట‌పై అభ్యంత‌రం వ్య‌క్తం చేస్తూ మాచ‌వ‌రం పోలీస్ స్టేష‌న్‌లో ఆయ‌న‌ ఫిర్యాదు చేశారు.  ఈ సందర్భంగా న్యాయవాది మాట్లాడుతూ..తెలుగు రాష్ట్రాల్లో పవన్ కళ్యాన్ కి ఎంతో మంది ఫ్యాన్స్ ఉన్నారు..ఆయన సినిమా పాటలంటే అందరికీ అభిమానం..ఎక్కువ పాపులర్ అవుతుంటాయి. 

ఎలా బ్రతికేది?

ఇదే క్రమంలో కొడకా కోటేశ్వర్రావు అనే పాటతో ఆ పేరు గలవాళ్లు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నేను కోర్టులకు వెళ్లి అందరూ నా ముందు ఆ పాట పాడుతూ..గెలి చేస్తున్నారు. ఇక మా బంధువుల పిల్లలు ఒకప్పుడు నేను అంటే ఎంతో భయపడేవారు..కానీ వారు సైతం నా ముందు కొడకా కోటేశ్వర్రావు అంటూ వ్యంగంగా పాటపాడుతున్నారు..అదేమంటే పవన్ కళ్యాన్ పాట అంటూ బుకాయిస్తున్నారు.  అయినా వ్యక్తుల పేర్లు వాడే ముందు వారి మనోభావాలు దెబ్బతింటాయని ఎందుకు అనుకోరని ఆగ్రహం వ్యక్తం చేశారు సదరు న్యాయవాది.   

 మాస్‌కే కాదు.. ఫ్యామిలీ ఆడియెన్స్

అంతే కాదు ఈ పేరు కలవాళ్లు పాఠశాలల్లో విద్యార్థులకు పాఠాలు చెప్పేవారు కూడా ఎంతో మంది ఉన్నారు..అలాంటి వారి ముందు పిల్లు వెక్కిరిస్తూ పాటలు పాడుతుంటే వారి మనసు బాధపడుతుంది..తలెత్తుకుని స్కూలుకు వెళ్లే పరిస్థితి లేకుండా పోయింది. పిల్లలు ఎగతాళి చేస్తోంటే ఎట్లా బ్రతికేది? వెంటనే ఈ పాటను తొలగించాలి, బ్యాన్ చేయాలి..... ఇందుకోసం తెలుగు రాష్ట్రాల్లోని కోటేశ్వరరావులు అంతా ఏకం కావాలి అని న్యాయవాది కోటేశ్వరరావు కోరారు. 

మా మనో భావాలు దెబ్బతినేలా పాట ఉంది

మరోవైపు పవన్ అభిమానులు ఈ విషయాన్ని ఖండిస్తున్నారు.  తమకు ఇష్టమైన పాటపై ఇలాంటి కేసు నమోదు కావడంపై అభిమానులు ఒకింత ఆశ్చర్యపోతున్నారు. అయితే గతంలో కూడా పలు పేర్లతో పాటలు వచ్చాయని..అప్పుడు రాని ఇబ్బందులు కొత్తగా ఇప్పుడెలా వస్తున్నాయి..అంటూ ఇది కావాలని ఎవరో ప్లాను చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఫ్యాన్స్.  




మరింత సమాచారం తెలుసుకోండి: