సంక్రాంతి భారీ సినిమాల మధ్య ఆసినిమాలకు సవాల్ విసురుతూ ఈవారం సూర్య నటించిన ‘గ్యాంగ్’ విడుదల అవడం ఒక ఆశ్చర్యం అయితే ఆసినిమా వెనుక అల్లు అరవింద్ మరియు యూవి క్రియేషన్స్ ఉండటం మరింత ఆశ్చర్యంగా మారింది. ఈ పరిస్థితుల నేపధ్యంలో హీరో సూర్య కూడ ఈమూవీని చాలపెద్ద ఎత్తున ప్రమోట్ చేస్తున్నాడు.

 

ఈ ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా సూర్య ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అక్కినేని 3తరాల హీరోలు కలిసి నటించిన సినిమా ‘మనం’ పై సంచలన వ్యాఖ్యలు చేసాడు.  అన్నపూర్ణ బ్యానర్ చరిత్రలోనే మరపురాని చిత్రంగా నిలిచిపోయింది ‘మనం’ ను తమిళంలో రీమేక్ చేయాలని అనుకున్నా విషయాన్ని బయట పెడుతూ ఆ రీమేక్ ఆలోచనలు ఎందుకు విరమించుకున్నాడో వివరించాడు.

 

‘మనం సినిమాను తమిళ్ లో రీమేక్ చేయాలనుకున్నాం. నేను, కార్తి, మా తండ్రి శివకుమార్ కలిసి నటించాలనుకున్నాం. విక్రమ్ కుమార్ ను కలిసింది కూడా అందుకే. అయితే ఏదైనా మ్యాజిక్ జరిగినప్పుడు దాన్ని మళ్ళీ రిపీట్ చేయాలనుకోవడం తప్పు అనిపించి ఆ మూవీ రీమేక్ ఆలోచనలు వదులుకున్నా’ అంటూ మనం  పై ఆసక్తికర కామెంట్స్ చేసాడు.  

 

ఇదే సందర్భంలో ‘గ్యాంగ్’ సినిమా స్టోరీలైన్ పై స్పందించాడు సూర్య. 1980 - 87లో జరిగిన చోరీల ఆధారంగా ‘స్పెషల్ ఛబ్బీస్’ తెరకెక్కిందని దాన్ని స్ఫూర్తిగా తీసుకొని గ్యాంగ్ ను రూపొందించామని చెపుతూ ‘గ్యాంగ్’ సినిమాను కూడ యదార్థ ఘటనల ఆధారంగా డిఫరెంట్ స్క్రీన్ ప్లేతో తీసిన విషయాన్ని బయటపెట్టాడు సూర్య..  

 


మరింత సమాచారం తెలుసుకోండి: