హీరోలు తమమధ్య ఎటువంటి భేదాభిప్రాయాలు లేవు తాము అంతా ఒకటే అని అనేకసార్లు చెప్పినా టాప్ హీరోల అభిమానులు మాత్రం ఆమాటలను పట్టించుకోకుండా మాటల మంటలు రగిలిస్తూ యుద్ధాలు చేస్తూనే ఉంటారు. దీనితో ఒక టాప్ హీరో సినిమా అటూఇటూ అయితే మిగతా టాప్ హీరోల అభిమానులకు అదోరకం పండగగా మారిపోతోంది.

 

 ఈనేపధ్యంలో  ‘అజ్ఞాతవాసి’ రిజల్ట్ బయటకు వచ్చాక  చాలామంది ‘అజ్ఞాతవాసి’ ని టార్గెట్ చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఆశ్చర్యకరంగా ఎవరు పవన్ ను టార్గెట్ చేయడంలేదు. సెటైర్లు అన్ని త్రివిక్రమ్ పైనపడటం ఇక్కడి ట్విస్ట్.  ‘అజ్ఞాతవాసి, ఇది త్రి’వక్రమ్’ సినిమా అంటూ కొందరు సెటైర్లు వేస్తూ ఉంటే అభిమానుల కోసమే అయితే పక్కా మాస్ సినిమా తీయాలి రీమేక్ చేయాలనిపిస్తే అఫీషియల్ గా కథ తీసుకొని అదే మూడ్ లో సినిమా చేయాలి.. ఫ్యాన్స్ పేరు చెప్పి యాక్షన్ సినిమాను కామెడీ డ్రామా చేస్తే పులిహోరే అవుతుంది’ అని మరికొందరు ఘాటైన కామెంట్స్ చేస్తున్నారు.

 

 మరికొంతమంది అయితే ‘ఇంక్ అయిపోయిన పెన్నుతో ఎన్ని మంత్రాలు వేసినా పారవని ఆమాంత్రికుడికి తెలిసుండాలి’ అంటూ త్రివిక్రమ్ రైటింగ్ స్కిల్ల్స్ పై కామెంట్స్ చేస్తున్నారు. ‘ఈ సారైనా తెలుసుకోవాలి ఒకసారి కథ దొబ్బేసి పేరేయటం మర్చిపోయా అన్నాడు. ఎంత టాలెంట్ ఉన్నా మరొకరి సొత్తు నాదే అని చెప్పుకోవటం భావ్యం కాదు ఇప్పటికైనా ఇది రీమేక్ అని చెప్తే కనీసం ఇన్స్‌పైర్ అయ్యాం అన్న మాటన్నా అంటే గౌరవంగా ఉంటుంది’ అంటూ మరికొందరు లార్గో వించ్ వ్యహారాన్ని గుర్తుకు చేస్తున్నారు.

 

‘తండ్రీకొడుకుల సెంటిమెంట్, రొటీన్ రివెంజ్ స్టోరీ, ఇద్దరు హీరోయిన్లు, హీరోతో కామెడీ, ‘ఈ నాలుగు మంత్రాలు మాత్రమే త్రివిక్రమ్ కు తెలుసా’ అంటూ మరికొందరు సెటైర్లు వేస్తున్నారు.  ఇంకొందరు మరో అడుగు ముందుకు వేసి‘కాపీ దెబ్బకి రెండోసారి ఒకే ప్రొడక్షన్ హౌస్ బలి అయ్యిందట పాపం. నవలని, పాత సినిమాని ఎత్తేస్తే కాస్త ఖర్చుతో పోయింది. ఈసారి ఏకంగా యూరోపియన్ సినిమా. వాళ్ళ కరెన్సీ యూరోలు మరి. ఇలా ఖర్సైపోతే ఎలా కోటేశ్వర్రావా’ అంటూ త్రివిక్రమ్ పై ఘాటైన వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇది చాలదు అన్నట్లుగా ఇది త్రివిక్రమ్ నిజమైన  ‘అజ్ఞానవాస’ మే అంటూ కొందరు సోషల్ మీడియాలో వేస్తున్న సెటైర్లు చూస్తూ ఉంటే ‘అజ్ఞాతవాసి’ ఫెయిల్ అవ్వడం వల్ల పవన్ ఇమేజ్ కి ఏమాత్రం నష్టం జరగలేదు సరి కదా మొత్తం పాపం అంతా త్రివిక్రమ్ ఖాతాలోకి వెళ్లి పోయింది అన్న కామెంట్స్ వస్తున్నాయి..

 


మరింత సమాచారం తెలుసుకోండి: