రాజ్ తరుణ్ ‘రంగుల రాట్నం’ మూవీ ఈ సంక్రాంతి రేసులో నిలబడటం ఆశ్చర్యమే అయినా అక్కినేని నాగార్జున సొంత సినిమా కావడంతో ఇంత భారీ పోటీలో కూడ ఈమూవీకి చెప్పుకోతగ్గ స్థాయిలో స్క్రీన్స్ దక్కాయి. అయితే అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మించే ప్రతిసినిమాను మీడియా ముందుకు వచ్చి ప్రమోట్ చేయడం ఎప్పటి నుంచో నాగార్జునకు ఉన్న అలవాటు.

 raj tarun in rangula ratnam latest photos కోసం చిత్ర ఫలితం

 

ఎంత చిన్న సినిమాకు అయినా నాగ్ మీడియా ముండుకుకు వచ్చి ప్రమోట్ చేస్తే ఆ సినిమాకు మంచి ఓపెనింగ్స్ వస్తాయి అన్న నమ్మకం ఉంది. ఈవిషయాలు అన్నీ తెలిసినా నాగార్జున ‘రంగులరాట్నం’ ప్రమోషన్ విషయంలో ఏమాత్రం పట్టించుకోవడం లేదు అని టాక్. దీనికి కారణం అఖిల్ ‘హలో’ అని అంటున్నారు. మీడియా ముందుకు వచ్చినప్పుడు ‘హలో’ సినిమా ఎందుకు ఫెయిల్ అయింది అన్న విషయాలు ఎవరైనా ప్రస్తావిస్తే వాటికి సమాధానాలు చెప్పడం నాగార్జునకు ఇష్టం లేదట.

raj tarun in rangula ratnam latest photos కోసం చిత్ర ఫలితం 

 

అదీకాకుండా ‘హలో’ చాల మంచి సినిమా అని నాగార్జున చెప్పినా జనం చూడని నేపధ్యంలో వెనువెంటనే ఎటువంటి గ్యాప్ లేకుండా ‘రంగుల రాట్నం’ సినిమా చాల బాగుంటుంది అన్న మాటలు ఉపయోగిస్తూ ప్రమోట్ చేయడం తనకు అంత ఇష్టంగా లేదు అని నాగార్జున అంటున్నట్లు టాక్. దీనితో ఈవిషయమై ఈమూవీ హీరో రాజ్ తరుణ్ నాగార్జునను మీడియాలో ప్రమోట్ చేయమని స్వయంగా కోరినా నాగార్జున సున్నితంగా రాజ్ తరుణ్ కోరికను త్రిరస్కరించినట్లు టాక్.

 సంబంధిత చిత్రం

 

దీనితో ఈ మూవీ ప్రమోషన్ ను ఈసినిమా నటీనటుల చేత చేయిస్తున్నారు. ఇది ఇలా ఉండగా ‘అజ్ఞాతవాసి’ ఫెయిల్ అవ్వడం ‘జై సింహా’ కేవలం మాస్ ప్రేక్షకుల సినిమాగా మారే అవకాశం ఉండటంతో ఎటువంటి పోటీ లేని పరిస్తుతులతో అతి తక్కువ బడ్జెట్ తో చిన్న సినిమాగా రూపొందిన ‘రంగులరాట్నం’ ఎవరూ ఊహించని విధంగా సంక్రాంతి రేస్ లో విన్నర్ గా మారినా ఆశ్చర్యం లేదు అని అంటున్నారు.. 

 


మరింత సమాచారం తెలుసుకోండి: