నెగిటివ్ టాక్ తో కలవరపెడుతున్న ‘అజ్ఞాతవాసి’ ని రక్షించడానికి చివరిప్రయత్నంగా ఈసినిమా దర్శక నిర్మాతలు ప్లాన్ బి ని సిద్ధం చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ‘అజ్ఞాతవాసి’ లో వెంకటేష్ ప్రత్యేక పాత్రను చేసిన సన్నివేశాలను త్రివిక్రమ్ ఈమూవీ నుండి తొలగించడం వెనుక వేరే ఎత్తుగడ ఉంది అని అంటున్నారు.

 PAVAN AGYATHA VASI LATEST PHOTOS కోసం చిత్ర ఫలితం

ఈమూవీ ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది అన్న ఊహతో ఈమూవీ మ్యానియా కొంతవరకు చల్లారాకా తిరిగి పవన్ అభిమానులను రెండవ సారి ‘అజ్ఞాతవాసి’ ధియేటర్ల వైపు రప్పించడానికి అస్త్రంగా వెంకటేష్ పవన్ సీన్స్ ను పక్కకు పెట్టి వాటిని సంక్రాంతి హడావిడి అయ్యాక ఈమూవీకి కలుపుదాము అన్న ఎత్తుగడ మొదట్లో త్రివిక్రమ్ వేసినట్లు టాక్. అయితే అందరి అంచనాలు తలక్రిందులు అవుతూ ‘అజ్ఞాతవాసి’ కి మొదటిరోజు మొదటి షో నుండి నెగిటివ్ టాక్ రావడంతో ఈమూవీని రక్షించదానికి ఇప్పుడు ప్లాన్ బి అమలుపరుస్తున్నట్లు తెలుస్తోంది.

 

తెలుస్తున్న సమాచారం మేరకు పవన్ వెంకటేష్ లు నటించిన సన్నివేశాలను ‘అజ్ఞాతవాసి’ మూవీలో ఈ సంక్రాంతి పండుగ నుండి యాడ్ చేస్తారని టాక్. ‘అజ్ఞాతవాసి’ సినిమాకు సంబంధించి వెంకీ పై 4రోజులు షూట్ చేశారు. ఒక యాక్షన్ బ్లాక్ తో పాటు పవన్ వెంకీ మధ్య ఒక ఆసక్తికర సన్నివేశం కూడా ఉంది. ఈసినిమాలో వచ్చే ఒక భారీ ఫైటింగ్ సీన్ ముగిసిన తరువాత వెంకటేష్ పాత్ర ఎంటర్ అవుతుందని తెలుస్తోంది.

 PAVAN AGYATHA VASI LATEST PHOTOS కోసం చిత్ర ఫలితం

పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించే వెంకీ ఈమూవీలోని ఒక భారీ ఫైట్ సీన్ ముగిసిన తరువాత వచ్చి ఎవరు చేసారు ఇదంతా అంటాడట అప్పుడు పవన్ ‘నేనే’ అంటాడు. నువ్వా.. ఎందుకు చేసావ్ అంటాడు వెంకీ. నా మీదకు వచ్చారు చంపాను అంటాడు. ‘నమ్మేలా లేదయ్యా నువ్వు ఇంతమందిని చంపావంటే’ అనే డైలాగ్ వెంకటేష్ నోటివెంట వస్తుందట. అక్కడితో వెంకటేష్ ఆగకుండా అదేదో సినిమాలో ‘నాకో తిక్కుంది.. దానికో లెక్కుంది’ అనే డైలాగ్ చెప్పిన హీరొలా కనిపిస్తున్నావు. అతగాడికి నీకు పోలికలు ఉన్నాయి’ అని కూడ అంటాడట. దీనికి పవన్ సమాధానం ఇస్తూ ‘అవునా సర్, నేను కూడా చూసాను సర్ ఆ సినిమా’ అంటూ పవన్ తన పాపులర్ పంచ్ డైలాగ్ ను రిపీట్ చేస్తాడట. అయితే దీనికి వెంకటేష్ కౌంటర్ వేస్తూ ‘అబ్బే.. నువ్వు బాగా చెప్పలేదయ్యా,  ఆ హీరోనే బాగా చెప్పాడు’ అంటూ వెళ్లిపోతాడట. ఇప్పుడు అదే సీన్ ను ‘అజ్ఞాతవాసి’ కి కలపబోతున్నారు అని తెలుస్తోంది. అయితే ఇప్పటికే ఈమూవీ నెగిటివ్ టాక్ దావానంలా వ్యాపించడంతో ఆఖరి ప్రయత్నంలా చేస్తున్న ఈ ప్లాన్ ‘బి’ ని చూడటానికి కనీసం పవన్ అభిమానులైనా వస్తారా అన్నదే ప్రశ్న.. 

 


మరింత సమాచారం తెలుసుకోండి: