ఈ మద్య ఎక్కువ శాతం హాలీవుడ్ సినిమాలు కాపీ కొట్టి కాస్త తమదైన స్టైల్లో పూత పూసి తెరకెక్కిస్తున్నారని వదంతులు వినిపిస్తున్నాయి. కానీ టాలీవుడ్ దర్శక, నిర్మాతలు మాత్రం అబ్బే అలాంటిది ఏమీ లేదు...కాకపోతే పర భాషలో వచ్చిన సినిమా కథ మన తెలుగు నేటివిటీకి తగ్గట్టు తీర్చి దిద్ది తెరకెక్కిస్తున్నామని అంటున్నారు. 
అలా సద్దుమణిగించినా?..:
నిన్న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయిన ‘అజ్ఞాతవాసి’ పై ఇప్పుడు ఫ్యాన్స్ కూడా పెదవి విరుస్తున్నారు.  ఇండస్ట్రీలో చిన్న సినిమా అయినా సరే నచ్చితే..జై కొడతారు..నచ్చకుంటే బండకేసి కొడతారు. ఇప్పటి వరకు పెద్ద, చిన్న సినిమా విషయాల్లో ఇది రుజువైంది.  తమ అభిమాన హీరో పవన్ కళ్యాన్ నటించిన  'అజ్ఞాతవాసి'ని జీర్ణించుకోలేకపోతున్న అభిమానులు సినిమాపై తీవ్ర విమర్శలకు దిగుతున్నారు. ముఖ్యంగా ఈ సినిమాకు దర్శకత్వం వహించిన త్రివిక్రమ్ రేంజ్ ఇంత దారుణంగా పడిపోయిందే అని అంటున్నారు.
Image result for jerome salle
గత కొన్ని రోజులు నుంచి ‘అజ్ఞాతవాసి’ ఫ్రెంచ్ లో వచ్చిన  'లార్గో వించ్' సినిమాకు కాపీ అన్న ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ఏకంగా జెరోం సల్లేనే స్వయంగా సినిమా చూసి 'అజ్ఞాతవాసి'కి నా సినిమాతో చాలా దగ్గరి పోలికలు ఉన్నాయని తేల్చేశారు.'లార్గో వించ్' సినిమాకు కాపీ అన్న ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. జెరోం సల్లే అక్కడితో ఆగకుండా.. టీ-సిరీస్‌కు అమ్మిన హక్కులు కేవలం ఇండియాకే పరిమితం.. కానీ అజ్ఞాతవాసి ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయింది.
Image result for trivikram pawan
కాబట్టి.. దీనిపై లీగల్ చర్యలకు దిగాలా?.. అనే సంశయాన్ని ఆయన లేవనెత్తినట్లుగా అర్థమవుతోంది.  ఒకవేళ  జెరోం సల్లే గనుక చట్టపరమైన చర్యలకు దిగితే 'అజ్ఞాతవాసి' నిర్మాతలు భారీగా మూల్యం చెల్లించుకోక తప్పదు. అసలే సినిమా పై మిశ్రమ స్పందన వస్తుంది..కొన్ని చోట్ల అయితే ఫ్లాప్ టాక్ రావడం గమనార్హం. ఈ సమయంలో మూలిగే నక్కమీద తాటికాయ పడ్డట్టు..నిర్మాతలకు ఇప్పుడు జెరోం సల్లే దడ పుట్టిస్తున్నాడు. హాలీవుడ్ డైరెక్టర్స్ ఇంత అప్రమత్తంగా ఉంటే తెలుగు దర్శకులకు చాలా కష్టమంటూ సోషల్ మీడియాలోనూ సెటైర్స్ పడుతున్నాయి.
 


మరింత సమాచారం తెలుసుకోండి: