ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ న‌టించిన అజ్ఞాత‌వాసి సినిమా బుధ‌వారం థియేట‌ర్ల‌లోకి వ‌చ్చేసింది. ఈ సినిమాకు పెట్టిన బ‌డ్జెట్‌, జ‌రిగిన బిజినెస్, ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌తో పాటు, త్రివిక్ర‌మ్ ఎవ‌రి రెమ్యున‌రేష‌న్ ఏంట‌నేది ఓ సారి పరిశీలిస్తే ఆస‌క్తిక‌ర‌మైన విష‌య‌లే బ‌య‌ట‌కు వ‌చ్చాయి. సినిమాలో రెమ్యున‌రేష‌న్ల లెక్కే చాలా ఎక్కువుగా ఉంది. ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌కు రూ. 30 కోట్ల రెమ్యున‌రేష‌న్‌, ఇక త్రివిక్ర‌మ్‌కు రూ.20 కోట్లు ఇచ్చిన‌ట్టు స‌మాచారం.

Image result for agnathavasi stills

ఇక హీరోయిన్లుగా చేసిన కీర్తి సురేష్‌కు 1 కోటి ఇవ్వ‌గా, మ‌రో హీరోయిన్ అను ఎమ్మాన్యుయేల్‌కు రూ.20 ల‌క్ష‌లు ఇచ్చార‌ని వినికిడి. ఇక కోలీవుడ్ టాప్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ అనిరుధ్ ర‌విచంద్ర‌న్‌తో ఈ సినిమాకు మ్యూజిక్ చేయించారు. అనిరుధ్‌కు ఉన్న క్రేజ్ దృష్ట్యా రూ.3 కోట్లు ముట్ట చెప్పిన‌ట్టు తెలుస్తోంది. ఇక ఇత‌ర ఖ‌ర్చులు మొత్తం క‌లిపి రూ. 6 కోట్లు కాగా, ప్రొడ‌క్ష‌న్ ఖ‌ర్చు రూ.13 కోట్లు అని లెక్క‌. 

Image result

ఇక పై ఖ‌ర్చులు కాకుండా సినిమా ప్ర‌మోష‌న్‌కు మ‌రో రూ.2 కోట్లు ఖ‌ర్చు చేసిన‌ట్టు స‌మాచారం. ఇక ప‌వ‌న్ గ‌త సినిమాలు ప్లాప్ అయినా ప‌వ‌న్‌కు ఉన్న క్రేజ్ దృష్ట్యా ఈ సినిమాకు అత‌డికి రూ.30 కోట్లు ఇచ్చార‌ట‌. ఇక అజ్ఞాతవాసి విడుదలకు ముందే 150 కోట్లకుపైగా బిజినెస్ చేసింది. థియేట్రికల్ రైట్స్ 120 కోట్లు,  తెలుగు శాటిలైట్ రైట్స్ 19 కోట్లు,  ఇతర భాషల శాటిలైట్ రైట్స్ 6 కోట్లు,  డిజిటల్ రైట్స్ 7 కోట్లు,  ఇతర హక్కులకు 3 కోట్లు మొత్తంగా అజ్ఞాతవాసి చిత్రం రూ.155 కోట్లకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ చేయడం ఓ రికార్డు.



మరింత సమాచారం తెలుసుకోండి: