టాలీవుడ్‌లో మెగా ఫ్యామిలీ హీరోలు ఇప్ప‌టికే ఓ చిన్న సైజు క్రికెట్ టీం అన్న పేరుంది. ప్ర‌తి యేటా మెగా ఫ్యామిలీ హీరోలు న‌టించిన సినిమాలు స‌గ‌టున నెల‌కు ఒక‌టి చొప్పున వ‌స్తున్నాయి. ఇక డిసెంబ‌ర్‌లో మెగా ఫ్యామిలీ హీరోలు అయిన సాయి ధ‌ర‌మ్ జ‌వాన్‌, అల్లు శిరీష్ ఒక్క క్ష‌ణం సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఇక జ‌న‌వ‌రిలో ప‌వ‌న్ అజ్ఞాత‌వాసి సంక్రాంతి కానుక‌గా ఇప్ప‌టికే వ‌చ్చింది. ఇక వ‌రుస‌గా చెర్రీ రంగ‌స్థ‌లం, బ‌న్నీ నా పేరు సూర్య‌, వ‌రుణ్‌తేజ్ సినిమాలు లైన్లో ఉన్నాయి.

Image result for mega heros

ఇక ఇప్పుడు ఈ లిస్టులో చేరేందుకు మ‌రో మెగా ఫ్యామిలీ హీరో రెడీ అవుతున్నాడు. అతనెవరో కాదు మెగాస్టార్ కుమార్తె శ్రీజ భర్త కళ్యాణ్. మెగాస్టార్ చిరంజీవి రెండో కుమార్తె శ్రీజ భ‌ర్త క‌ళ్యాణ్ చిత్తూరు జిల్లాకు చెందిన ప్ర‌ముఖ పారిశ్రామిక‌వేత్త‌ల కుటుంబానికి చెందిన వార‌సుడు. అత‌డు చిరు కుమార్తె శ్రీజ‌ను వివాహం చేసుకున్న సంగ‌తి తెలిసిందే.

Image result for mega heros

ప్ర‌స్తుతం వైజాగ్‌లో సత్యానంద్ దగ్గర యాక్టింగ్ నేర్చుకున్న క‌ళ్యాణ్ త్వ‌ర‌లోనే టాలీవుడ్ వెండి తెర‌పై హీరోగా ఎంట్రీ ఇవ్వ‌నున్నాడు. జతకలిసే సినిమాకు దర్శకత్వం వహించిన రాకేశ్ రిషి ఈ సినిమాకు డైరెక్టర్. ఇక ఈ సినిమాలో క‌ళ్యాణ్ స‌ర‌స‌న మేఘా ఆకాష్ హీరోయిన్ గా నటించబోతోందని తెలుస్తోంది. మేఘా ఆకాష్ తెలుగులో ఇప్ప‌టికే నితిన్ సినిమా లై లో న‌టించింది.

Image result for srija kalyan

ఆమె ఇక్క‌డ హీరోయిన్‌గా చేసిన తొలి సినిమాయే అట్ట‌ర్ ప్లాప్‌. మ‌రి ఇప్పుడు ఈ ప్లాప్ హీరోయిన్‌ను క‌ళ్యాణ్ ప‌క్క‌న ఫిక్స్ చేశారు. మ‌రి ఆమె క‌ళ్యాణ్‌కు ఎంత వ‌ర‌కు క‌లిసొస్తుందో ?  చూడాలి. ఇక మేఘాను క‌ళ్యాణ్ స‌ర‌స‌న హీరోయిన్‌గా ఫిక్స్ చేశార‌న్న వార్త‌ల్లో నిజా నిజాలు తెలియాలంటే మెగా కాంపౌండ్ నుండి అధికారిక సమాచారం వచ్చే వరకు వేచి చూడాల్సిందే.  


మరింత సమాచారం తెలుసుకోండి: