భారీ ఓపెనింగ్స్ తో రికార్డులను క్రియేట్ చేస్తూ విడుదలైన ‘అజ్ఞాతవాసి’ ఘోర పరాజయాన్ని పవన్ అభిమానులు సైతం జీర్ణించుకోలేకపోతున్నారు. ఈసినిమా పై విమర్శకుల దాడితో పాటు ఈమూవీ పై పడుతున్న సెటైర్లు ఈమధ్య కాలంలో ఏ టాప్ హీరో సినిమా పైనా పడలేదు.

 

సాధారణంగా తాను నటించే సినిమాల రికార్డులు గురించి జయాపజయాల గురించి పట్టించుకోని పవన్ కళ్యాణ్ ను కూడ ‘అజ్ఞాతవాసి’ ఫెయిల్యూర్ స్పందింప చేసింది అన్న వార్తలు వస్తున్నాయి. తెలుస్తున్న సమాచారం మేరకు పవన్ స్వయంగా రంగంలోకి దిగి ‘అజ్ఞాతవాసి’ టీమ్ ను నిరాశ పడవద్దని చెపుతున్నట్లు టాక్.

 PAVAN AGYATHA VASI LATEST PHOTOS కోసం చిత్ర ఫలితం

అంతేకాదు ఈసినిమాకు సంబంధించి ప్రమోషన్ విషయాలను ఈ సంక్రాంతి ముగిసే వరకు కొనసాగించమని అదేవిధంగా ఈమూవీకి సంబంధించిన విషయాల పై ఇంటర్వ్యూలు కూడ ఇమ్మని పవన్ త్రివిక్రమ్ ను ప్రోత్సహిస్తున్నట్లు టాక్. అంతేకాదు ఈసినిమా మొదటిరోజు సాధించిన కలక్షన్స్ రికార్డులకు ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలుపుతూ ఒక మీడియా మీట్ ను కూడ ఏర్పాటు చేయమని పవన్ ఈసినిమా దర్శక నిర్మాతలకు సూచిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

 PAVAN AGYATHA VASI LATEST PHOTOS కోసం చిత్ర ఫలితం

 అంతేకాదు ఈసినిమా మొదటిరోజున ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తన అభిమానులు తన పై చూపించిన అభిమానానికి కృతజ్ఞతలు తెలియచేసుకోవలసిన బాధ్యత తన పై ఉందని అన్న ఉద్దేశ్యాన్ని కూడ పవన్ త్రివిక్రమ్ కు చెపుతున్నట్లు తెలుస్తోంది. దీనినిబట్టి చూస్తుంటే పవన్ త్రివిక్రమ్ తో కలిసి ఈ సంక్రాంతి ముగిసేలోగానే తన అభిమానులకు కృతజ్ఞతలు తెలియచేసే ఒక వీడియోను విడుదల చేసే ఉద్దేశ్యంలో ఉన్నట్లు అర్ధం అవుతోంది. ‘అజ్ఞాతవాసి’ పరాజయం గురించి ఇక మరింత చర్చలు జరగకుండా ఇక్కడితో ఈ వ్యవహారానికి ముగింపు పలికి తన ఇమేజ్ కి ఏమాత్రం నష్టం కలగకుండా తిరిగి పవన్ జనం మధ్య రావడానికి ఈ వ్యూహాలు పవన్ అనుసరిస్తున్నట్లు కొంతమంది భావన..  

 


మరింత సమాచారం తెలుసుకోండి: