ఈరోజు ప్రపంచవ్యాప్తంగా విడుదలైన బాలకృష్ణ ‘జై సింహా’ మూవీ రిజల్ట్ కోసం ఇండస్ట్రీ వర్గాలతోపాటు నందమూరి సింహం అభిమానులు కూడ ఎంతో ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. మొదట్లో ‘అజ్ఞాతవాసి’ మ్యానియా ముందు ‘జై సింహా’ నిలబడుతుందా ? అని కామెంట్స్ చేసిన విశ్లేషకులే ‘అజ్ఞాతవాసి’ ఫలితం తేడా వచ్చిన తరువాత ‘జై సింహా’ కు అదృష్టం కలిసివస్తోంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. బాలకృష్ణ సినిమాలు అంటేనే మాస్ మసాలాతో నిండి ఉంటాయి. దీనికితోడు ఈసినిమాకు బాలయ్యకు కలిసి వచ్చే సంక్రాంతి సెంటిమెంట్ తో పాటు నయనతార సెంటిమెంట్ కూడ కలిసి వస్తోంది.

 BALAKRISHNA AND NAYANATARA IN JAISIMHA MOVIE LATEST PHOTOS కోసం చిత్ర ఫలితం

 ఇలాంటి పరిస్థుతులలో ఈమూవీలో నటించడానికి నయనతార పెట్టిన కండిషన్స్ తో పాటు ఆమె ఈసినిమా నిర్మాతలతో చేసుకున్న ఒక ఎగ్రిమెంట్ కు సంబంధించిన గాసిప్పులు ఇప్పుడు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. ఈ చిత్రంలో నటించేందుకు మొదట నయన్ ఒప్పుకోలేదని స్వయంగా బాలకృష్ణ చెప్పిన విషయం తెలిసిందే. ఆ తర్వాత టెర్మ్స్ కుదరడంతో మూవీ యాక్సెప్ట్ చేసిందట నయన్. ఇంతకీ ఆ నిబంధనలు ఏంటో తెలిస్తే ఆశ్చర్యం కలగక మానదు.

 adolescent కోసం చిత్ర ఫలితం

 తాను నటించిన మూవీకి ప్రచారం చేయననే మాట నయన్ ఎప్పుడు చెపుతూనే ఉంటుంది. దీనికితోడు ఆమె ఈసినిమాలో బాలకృష్ణతో నటించడానికి మరో రెండు కండిషన్స్ పెట్టిందట. వీటిని దర్శకుడు ఒప్పుని నయనతారతో ఎగ్రిమెంట్ చేసుకున్న తరువాత మాత్రమే నయన్ ‘జై సింహా’ లో నటించిందని టాక్. తెలుస్తున్న సమాచారం మేరకు నయన్  కండిషన్స్ ఇలా ఉన్నాయి.

 BALAKRISHNA AND NAYANTHARA IN JAYASIMHA MOVIE LATEST PHOTOS కోసం చిత్ర ఫలితం

 సినిమా మొత్తంలో ఎక్కడా హీరో పాత్రధారితో ఇంటిమేట్ సీన్స్.. రొమాంటిక్ సీన్స్ ఉండకూడదు అన్నది ఒక కండిషన్ అయితే తెలుగు సినిమాల్లో సహజంగా కనిపించే హీరోయిన్ల డ్యాన్సులు ఎక్స్ పోజింగ్ లు అసలు చేయనంటే చేయనని ఖరాఖండీగా తేల్చేసిందట నయన్. ఈ రెండిటికి ఒప్పుకుని మరీ ‘జైసింహా’ లో నటించిందట నయనతార. అయితే నయానతార నటించే పాత్రకు ఉన్న ప్రాధాన్యత రీత్యా బాలకృష్ణ కూడ నయన్ చెప్పిన కండిషన్స్ ను నవ్వుతూ అంగీకరించాడని టాక్.  నయనతార పై బాలకృష్ణ పెట్టుకున్న నమ్మకం ఎంతవరకు సక్సస్ ను ఇస్తుందో మరి కొద్ది గంటలలో తేలిపోతుంది..

 


మరింత సమాచారం తెలుసుకోండి: