విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారక రామారావు నట వారసత్వాన్ని అందుకుంది.. నందమూరి వంశీ కీర్తి ప్రతిష్టలను పెంచుతూ వచ్చిన నట సింహం నందమూరి బాలకృష్ణ. ఎన్.టి.ఆర్ తర్వాత ఆ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పరచుకున్న హీరో ఆయన వారసుడిగా బాలయ్యకే ఆ అదృష్టం దక్కింది. ఇక తను చేసే ప్రతి సినిమా ఫ్యాన్స్ ను మాత్రమే కాదు సిని ప్రియులను అలరిస్తుంది. 


ఇక సక్సెస్ ఫుల్ గా 100 సినిమాలను పూర్తి చేసుకున్న బాలయ్య 100వ సినిమా శాతకర్ణితో సత్తా చాటారు. ఇక ఆ తర్వాత పైసా వసూల్ ఫ్లాప్ అయినా మళ్లీ జై సిం హాతో తన రేంజ్ ప్రూవ్ చేసుకునేందుకు వస్తున్నాడు. సింహా కంటే ముందు కెరియర్ సంక్షోభంలో పడినట్టు అనిపించగా బోయపాటి రూపంలో బాలయ్యకు హిట్ వచ్చింది. ఆ సినిమా తర్వాత బాలయ్య బాబు మళ్లీ తన మునుపటి ఫాంలోకి వచ్చాడు.  


సమర సింహారెడ్డి, నరసింహ నాయుడు సినిమాల టైంలో బాలయ్యతో పోటీ అంటే మిగతా హీరోల్లో వణుకు పుట్టేది. బాలకృష్ణ సినిమాకు ఎడ్లబండి కట్టుకుని వెళ్లిన సందర్భాలు ఉన్నాయి. ఇక ఇప్పుడు బాలయ్య జై సింహాతో వస్తున్నాడు. కె.ఎస్ రవికుమార్ డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వస్తుంది.   


క్రేజీ కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమాకు అంతా పాజిటివ్ ఫీడ్ బ్యాక్ వస్తుంది. సినిమా అంచనాలను అందుకుంటే మరో సూపర్ హిట్ బాలయ్య కెరియర్ లో పడినట్టే అంటున్నారు. నయనతార బాలకృష్ణ కలిసి నటించిన సింహా, శ్రీరామ రాజ్యం సినిమాలు హిట్ అవడంతో ఆ సెంటిమెంట్ తో జై సింహా కూడా సూపర్ హిట్ పక్కా అంటున్నారు చిత్రయూనిట్. మరి సినిమాతో బాలయ్య హిట్ కొడితే ఇక పోటీలో ఉన్న మిగతా సినిమాలకు దబిడి దిబిడే అని చెప్పొచ్చు. 



మరింత సమాచారం తెలుసుకోండి: