సంక్రాంతి పండుగ ప్రారంభం అయిందంటే చాలు తెలుగు వారి ప్రతీ ఇంటి ముందు రంగవల్లులు  కనిపిస్తాయి.  ఈ రంగురంగుల  ముగ్గుల వెనుక  బలమైన శాస్తీయ సాంప్రదాయ కోణాలు ఉన్నాయి. ఇంటి ముందు వేసే ముగ్గు ఆ ఇంటిలోని సంతోషాలకు అద్దం పడుతుంది. అందమైన ముగ్గలు వేస్తే ఆ ఇంటిలో లక్ష్మి ఆవాసం ఉంటుందంటారు.అదృష్టం ఆ ఇంటిని వరిస్తుందంటారు. ఇంటి ముందు వేసిన అందమైన ముగ్గు ఇంటిలోకి దేవతలను ఆహ్వానించటానికి   గుర్తు అని కుడా పెద్దలు చెపుతూ ఉంటారు.

 

 పురాణకథల ప్రకారం ఒకానొకప్పుడు ఒక రాజు తన కుమారుడిని కోల్పోతాడు. కాబట్టి ఆరాజు బ్రహ్మదేవుడిని తన కుమారుడిని బ్రతికించమని ప్రార్ధించాడు. దీర్ఘ తపస్సు తరువాత బ్రహ్మదేవుడు బాలుడిని బ్రతికించటానికి అంగీకరించాడు. బ్రహ్మదేవుడు నేలపైన బియ్యపు ముద్దతో రాకుమారుడు యొక్క బొమ్మను గీయమని రాజుని అడిగాడు. అప్పుడు బ్రహ్మదేవుడు తిరిగి రాకుమారుడికి జీవం పోస్తానని చెప్పాడు. ఆ సమయం నుండి రంగోలీ అన్నది జీవితం, అదృష్టం మరియు శ్రేయస్సు యొక్క చిహ్నంగా మారి మన జీవితాలలో ఒక ఆచారంగా మారింది అని కూడ అంటారు. 

సంబంధిత చిత్రం 

సంక్రాంతి మాసంలో వేసే ముగ్గుల వెనుక  ఆధ్యాత్మిక సాంస్కృతిక శాస్త్రీయ ధృక్పధాలు ఉన్నాయి అని అంటారు. ఒక పద్ధతి ప్రకారం పెట్టబడే చుక్కలు రాత్రి వేళ కనిపించే నక్షత్రాలకు సంకేతం. ఎంత పెద్దదైనా చిన్నదైనా ముగ్గు మధ్య గడిలో పెట్టే చుక్క సూర్య స్థానానికి సంకేతం.అని జ్యోతిష్య శాస్త్రం చెపుతోంది. ఇక ఈ పండుగ మాసంలో వివిధ ఆకారాలతో వేసే ముగ్గుల వివరాల్లోకి వెళితే విల్లు ఆకారం పునర్వసు నక్షత్రానికీ, పుష్పం పుష్యమీ నక్షత్రానికీ, పాము ఆకారము ఆశ్లేష నక్షత్రానికి, మేక, ఎద్దు, పీత, సింహం, ఇలాంటివి మేష, వృషభ, మిధున, కర్కాటక రాసులకూ, తొమ్మిది గడుల ముగ్గు నవగ్రహాలుకూ సంకేతాలుగా కూడా జ్యోతిష్య శాస్త్రవేత్తలు చెపుతున్నారు.

సంబంధిత చిత్రం

 ఇక పండుగల చివరిరోజు వేసే రధం ముగ్గు సామాజిక ఐక్యతను చాటి చెబుతుంది. మూడు రోజులతో పూర్తవుతూ అందరికీ ఆనందాన్ని పంచే పండుగను ఘనంగా సాగనంపేందుకు పుట్టినదే రధం ముగ్గు. అందరూ ఒకరికి ఒకరు తోడుంటూ కలసి సహజీవనం సాగించాలి అనే సంకేతాలతో ఒక రథం ముగ్గు తాడును మరొక ఇంటి వారి ముగ్గుతో కలుపుతూ పోయే సాంప్రదాయం  అందరు ఒకటే అనే సంకీతాలు ఇస్తుంది. పండుగ రోజుల్లో పెట్టె  ముగ్గులు, గొబ్బిళ్ళు లక్ష్మీదేవికి ప్రీతికరం. ఇలా ఎన్నో విషయాలు జీవితానికి ముడిపడినవి ఈముగ్గులలో నిక్షిప్తమై ఉన్నాయి..

.

 


మరింత సమాచారం తెలుసుకోండి: