అజ్ఞాత వాసి ఫలితం ఎలా ఉన్న అది పవన్ కళ్యాన్ మీద కొంచెం కూడా ప్రభావాన్ని చూపించదు. ఇంకా చెప్పాలంటే పవన్ కు సినిమా ల మీద కొంచెం కూడా ఆసక్తి లేదు. సినిమా లో కష్ట పడకపోవడం. మిగతా హీరో లు ఒక పక్క వాళ్ళ సినిమాల కోసం ఒళ్ళు వంచి కష్ట పడుతుంటే, పవన్ మాత్రం తన లెక్క లేని తనాన్ని చూపిస్తున్నాడు. ఈ జబ్బే ఇప్పుడు త్రివిక్రమ్ కు అంటుకున్నదా అందరు అనుకుంటున్నారు. అజ్ఞాత వాసి సినిమా చూసిన ప్రతి ఒక్కరికి ఆ ఫీలింగ్ రాక మానదు.  అయితే పవన్ అభిమాని ఒకరు తన ఆక్రోశాన్ని వెళ్ళగక్కాడు. 

Image result for pavan and trivikram

త్రివిక్రమ్ .. అతడు , ఖలేజా లాంటి పెక్యూలియర్ సినిమాలు తీసిన వ్యక్తే .. జల్సా – అత్తారింటికి దారేది లతో మాకు ఫుల్ మీల్స్ పెట్టిన వాడే .. అయితే ప్లాప్ సినిమా తీసినందుకు కాదు ఈ ఆక్రోశం .. లెక్కలేని తనాన్ని  లెక్కలేనంత గా తెరమీద ఆవిష్కరించిన పద్ధతి గురించి. నేను నాలుగు ముక్కలు ప్రాస డైలాగులు రాసేసి , కెమెరా యాంగిల్స్ మార్చేసి , రెండు ఫైట్ లు పెట్టేసి , ఒక్క ఎమోషన్ సీన్ పెట్టేస్తే సినిమా ఆడేస్తుంది అనే దర్పం త్రివిక్రమ్ ఈ సినిమాతో ఖచ్చితంగా చూపించాడు .

Image result for pavan and trivikram

జల్సా , ఖలేజా , అతడు లాంటి సినిమాలు ఇంకా ఇప్పటికీ యూట్యూబ్ లో,MAA TV లో బోర్ అనుకోకుండా చూసే మాకు మీ నుంచి కావాల్సింది ఇది కాదు సార్ .. మీ ఫ్రెండ్ కళ్యాణ్ గురించి కాదు మా బెంగ, ఇండస్ట్రీ లో ఏ హీరో టచ్ చెయ్యలేని రేంజ్ లో ఉన్నాడు అతను , ఐదేళ్ళ ప్లాప్ వరస అతనికి పెద్ద మ్యాటర్ ఏ కాదు.  అంతగా సినిమాల మీద ఆసక్తి పోతే ఆపేస్తాడు ఇంకా సాహిధించేసే టార్గెట్ లు అతనికి ఏమీ మిగిలి లేవు , కానీ మీలాంటి దర్శకుడు అలాంటి స్నేహితుడు ఇచ్చే అంటు వ్యాధి ఎక్కించుకుని దయచేసి మీ స్థాయి ని తగ్గించుకోవద్దు. అని తన భాదను చెప్పుకున్నాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: