టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్నో అంచనాల మద్య పవన్ - త్రివిక్రమ్ కాంబినేషన్ వచ్చిన ‘అజ్ఞాతవాసి’ రిలీజ్ అయిన అన్ని సెంటర్లో మిశ్రమ స్పందన సంపాదించింది. కొన్ని చోట్ల అయితే..మరీ ఫ్లాప్ టాక్ కూడా వచ్చింది.  ఏది ఏమైనా పవన్ కళ్యాన్ కి ఉన్న ఇమేజ్ తో ఫస్ట్ డే మాత్రం కలెక్షన్ల పరంగా దుమ్మురేపింది.  అయితే ఈ సినిమా రిలీజ్ అయినప్పటి నుంచి ఫ్యాన్స్ మొత్తం డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ పై ఫోకస్ పెట్టారు.
Image result for agnatavasi posters
గతంలో జల్సా, అత్తారింటికి దారేది లాంటి సినిమాల్లో చూపించినంతగా పవన్ ని చూపించలేదని..మొత్తం వరస్ట్ డైరెక్షన్ అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పవన్ ఫ్యాన్స్.  అంతే కాదు ఈ సినిమా ప్రారంభంలో విక్టరీ వెంకటేష్ కి ధన్యావాదలు అని తెలిపిన సంగతి తెలిసిందే..దీంతో వెంకటేష్ ఉంటాడని తెగ సంబర పడిపోయారు..కానీ చివరిదాకా చూసిన ఫ్యాన్స్ కి నిరాశే మిగిల్చారు. 

దీంతో ఇలాంటి రూమర్స్ క్రియేట్ చేసి థియేటర్లకు రప్పించడం చాలా అన్యాయం అని ఫ్యాన్స్ ఫైర్ అయ్యారు. పేలవమైన స్క్రీన్ ప్లేతో త్రివిక్రమ్ ఆకట్టుకోలేకపోయిన వైనం స్పష్టం అవుతుంది.  హిట్ అయితే చిందులు ఎలా ఉండేవో చెప్పవచ్చు గాని సినిమా ఫట్ అయితే అభిమానుల బాధ వర్ణనాతీతం. సోషల్ మీడియాలో కూడా పవన్ అభిమానులు చాలా వరకు సైలెంట్ అయిపోయారు.

అజ్ఞాతవాసి హిట్టుతో విమర్శకులకు గట్టిగా సమాధానం చెబుదామనుకున్న ఫ్యాన్స్ కి ఏ మాత్రం అవకాశం దొరకలేదు. ఈ నేపథ్యంలో ఈ సినిమాకు ఇప్పుడు కొన్ని రిపేర్లు చేస్తున్నారని సమాచారం. విక్టరీ వెంకటేష్ ఈ సినిమా స్పెషల్ అప్పీరియన్స్ లో కనిపించిన సీన్లను ఇప్పుడు యాడ్ చేస్తున్నారు.
Image result for agnatavasi posters
ఇప్పటికే అందుకు సంబంధించిన డబ్బింగ్ వీడియోను విడుదల చేశారు. ఇక ఈ తీసిపోతల లెక్కలను ఓసారి చూస్తే.. మొత్తంగా సినిమాలో 12 నిమిషాల వరకు తీశారట. ఇక ఎక్కువగా బోర్ కొట్టకుండా బాగా ఉండే సీన్లను ఓ 7 నిమిషాల 26 సెకన్ల వరకు యాడ్ చేశారట. అందులోనే వెంకటేష్ – పవన్ సీన్ కూడా ఉందని టాక్. 


మరింత సమాచారం తెలుసుకోండి: