టాలీవుడ్‌లో ఈ సంక్రాంతి సినిమాల‌కు రిలీజ్‌కు ముందు మంచి హైప్ వ‌చ్చింది. బ‌రిలో ప‌వ‌న్‌క‌ళ్యాణ్ అజ్ఞాత‌వాసి, బాల‌కృష్ణ జై సింహా సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఈ రెండు సినిమాల‌తో పాటు కోలీవుడ్ స్టార్ హీరో సూర్య డ‌బ్బింగ్ మూవీ గ్యాంగ్‌, అన్న‌పూర్ణ స్టూడియోస్ బ్యాన‌ర్‌పై అక్కినేని నాగార్జున రాజ్‌త‌రుణ్ హీరోగా తెర‌కెక్కించిన రంగుల‌రాట్నం సినిమా కూడా రిలీజ్ అవుతోంది.


ఈ నాలుగు సినిమాల్లో మూడు సినిమాలు ఇప్ప‌టికే రిలీజ్ అయ్యాయి. ప‌వ‌న్ అజ్ఞాత‌వాసి ఘోర‌మైన డిజాస్ట‌ర్ టాక్ తెచ్చుకుంటే నిన్న రిలీజ్ అయిన బాల‌య్య జై సింహాకు బిలో యావ‌రేజ్ - యావ‌రేజ్ టాక్ వ‌చ్చింది. ఇక సూర్య గ్యాంగ్  సినిమాకు జ‌స్ట్ ఓకే టాక్ ఉన్నా తెలుగు ప్రేక్ష‌కుల‌కు ఎంత వ‌ర‌కు క‌నెక్ట్ అవుతుందో చెప్ప‌లేం అంటున్నారు.

Image result for jai simha movie posters

ఇక బాల‌య్య‌కు సంక్రాంతి సెంటిమెంట్ ఎక్కువ‌. సింహా సెంటిమెంట్ కూడా ఉంది. ఈ రెండు సెంటిమెంట్ల‌ను నిజం చేస్తూ రిలీజ్ అయిన జై సింహా సినిమా ఓకే అనిపించుకుంది. ఈ సినిమా ఫ‌స్ట్ డే వ‌ర‌ల్డ్ వైడ్‌గా రూ. 8.25 కోట్ల షేర్ రాబ‌ట్టింది. ఈ సినిమా ఏరియా వైజ్ షేర్ ఇలా ఉంది.

Related image

జై సింహా ఫ‌స్ట్ డే ఏరియా వైజ్ షేర్ ( రూ.కోట్ల‌లో )
నైజాం - 1.16
సీడెడ్ - 1.53
వైజాగ్ - 0.75
గుంటూరు - 1.15
కృష్ణా - 0.46
ఈస్ట్ - 0.85
వెస్ట్ - 0.81
నెల్లూరు - 0.37
క‌ర్ణాట‌క - 0.60
ఓవ‌ర్సీస్ - 0.25
రెస్టాఫ్ వ‌ర‌ల్డ్ - 0.32
-----------------------------------------
టోట‌ల్ ఫ‌స్ట్ డే షేర్ = 8.25 కోట్లు
-----------------------------------------


మరింత సమాచారం తెలుసుకోండి: