బాలీవుడ్ డ్రీమ్ గర్ల్,  బీజేపీ ఎంపీ, నటి హేమమాలిని ఇంట్లోకి ఓ చిరుతపులి వచ్చింది.  సాధారణంగా అడవిలో కృర జంతువులు ఊళ్లపై పడుతుంటాయి..వాటికి చిక్కిన జీవాలను తింటుంటాయి..కర్మకాలి మనుషులు చిక్కినా వదలవు..చంపి తింటాయి.  ఇలా పలు గ్రామాల్లో ఇలాంటి సంఘటనలు తరుచూ జరుగుతున్నట్లు వార్తల్లో వింటుంటాం. 
Image result for hema malini chinta
తాజాగా ప్రముఖ బాలీవుడ్ నటి..హేమా మాలిని అటవీ శాఖ అధికారులకు ఫోన్ చేసి షాకింగ్ వార్త చెప్పడంతో హుటా హుటిన ఆమె ఇంటికి పరుగెత్తుకుని వచ్చారు. అంతలా కంగారు పడాల్సిన విషయం ఏంటా అనుకుంటున్నారా.. గుర్గావ్‌లోని హేమ మాలిని ఇంటి ముందు వాచ్‌మెన్‌ కూర్చొని ఉండగా ఓ చిరుతపులి ఆ వైపుగా వచ్చింది. ఆమె ఉంటున్న కాలనీలో కలియ దిరిగింది. మొదట కుక్కేమో అనుకొని లాఠీతో తరిమే ప్రయత్నం చేసేందుకు వెళ్లిన వాచ్‌మెన్‌ అది చిరుత అని గమనించాడు. పరుగులు తీస్తూ, చుట్టు పక్కల వారికి విషయం చెప్పాడు.   
Image result for హేమమాలిని చిరుత
ఎంపీ హేమమాలిని ఇంటి నుంచి చిరుతపులి వచ్చిందంటూ అటవీశాఖ అధికారులకు ఫోన్‌ రావడంతో.. ఉరుకులు పరుగుల మీద వారు అక్కడికి చేరుకున్నారు.  వారంతా అక్కడికి చేరుకొని చిరుతను పట్టుకునే ప్రయత్నం చేయగా అది తప్పించుకుంది. వాటిని బంధించే ప్రయత్నం చేసినప్పుడు మాత్రమే చిరుత పులులు దాడులు చేస్తాయని అధికారులు చెప్పారు. చిరుత పులులు వచ్చినప్పుడు ఏం చేయాలో ఏం చేయకూడదో వివరించి వెళ్లారు.


మరింత సమాచారం తెలుసుకోండి: