తెలుగు ఇండస్ట్రీలో బిల్లా, మిర్చి, బాహుబలి సీరీస్ తో ప్రభాస్, అనుష్క కాంబినేషన్ సక్సెస్ ఫుల్ గా కొనసాగింది.  అయితే వీరి మద్య ఉన్న కెమిస్ట్రీని చూసి చాలా మంది అఫైర్లు ఉన్నాయని పుకార్లు రేపారు.  అంతే కాదు త్వరలో అనుష్క, ప్రభాస్ లు పెళ్లి చేసుకోబోతున్నారని సోషల్ మీడియాలో ఊదరగొట్టారు.  మొత్తానికి తమ మద్య ఉన్నది కేవలం స్నేహబంధమే అని ప్రభాస్, అనుష్కలు తేల్చేశారు. ప్రభాస్ అభిమానులు మాత్రం వీరిని జంటగా చూడటానికే ఎక్కువ ఇష్టపడుతున్నారు.
Related image
ప్రస్తతం అనుష్క ‘భాగమతి’ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే.  ఈ సినిమాకు సంబంధించి టీజర్, ట్రైలర్ సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తుంది. మళ్లీ ఓ అరుంధతి రాబోతుందని ఫ్యాన్స్ ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు. ఇక బాహబలి 2 తర్వాత కాస్త గ్యాప్ తీసుకొని సుజిత్ దర్శకత్వంలో ప్రభాస్ ‘సాహూ’ చిత్రంలో నటిస్తున్నారు. 
Image result for anushka bhaagamathie
భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మొదట అనుష్క అనుకున్నారు..కానీ భాగమతి ప్రాజెక్ట్ వల్ల అనుష్క పక్కకు తొలిగినట్లు వార్తలు వచ్చాయి.  ఇక ప్రభాస్ సరసన బాలీవుడ్ అందాల భామ శ్రద్దా కపూర్ నటిస్తుంది.  ప్రభాస్ నటిస్తున్న ‘సాహో’ సెట్‌లో శుక్రవారం రాత్రి అనుష్క సందడి చేసింది. ఈ సందర్భంగా దర్శకుడు సుజీత్, మురళీ శర్మతో కలిసి సెల్ఫీ తీసుకుంది.
Image result for anushka prabhas baahubali
ఇప్పుడా ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ‘సాహో’ సెట్‌లో అనుష్కకు పనేంటని కొందరు అంటుంటే.. ఆమె అతిథి పాత్రలో కనిపించబోతుందని మరికొందరు కామెంట్ చేస్తున్నారు.మరి, అనుష్క ‘సాహో’లో ఉంటుందా? లేదా తన స్నేహితుడిని కలిసేందుకు మాత్రమే సెట్‌కు వచ్చిందా అనేది త్వరలోనే తెలుస్తుంది.




మరింత సమాచారం తెలుసుకోండి: