పవన్ కళ్యాణ్ అఙ్జాతవాసి సినిమా అమెరికా కలక్షణ్లను హాలీవుడ్ రికార్డ్ గా చెప్పుకున్నారు అభిమానులు అలేగే రెచ్చిపోయిన మీడియా కూడా! 500 నుండి 600 థియేటర్స్ లో ఒక విదేశీ సినిమా విడుదలవటమే అక్కడ రేర్. అందునా ఒక ప్రాంతీయ బాషా చిత్రం విడుదల అవటం కూడా బాగా అరుదే. అయితే  అజ్ఞాతవాసి సినిమా డిజాస్టర్‌ మొత్తం టాలీవుడ్‌నే ఆశ్చర్యపరుస్తోంది. పవర్‌ స్టార్‌ సినిమా మరీఇంత దారుణమైన దయనీయమైన ప్రదర్శన చేయడం ఏమిటని ఆయన అభిమానులే విస్తుపో తున్నారు. 

Image result for disastrous collections of agnathavasi

విపరీతమైన హైప్ వలన  సృష్టించబడ్ద భారీ అంచనాల మధ్య అజ్ఞాతవాసి సినిమా విడుదల కావడంతో తొలి రోజు కలెక్షన్లు టాలీవుడ్ చిత్ర పరిశ్రమలోనే బాహుబలి-1 మించిన వాసూళ్ళు రాబట్టింది. అయితే రెండో రోజు ఏ సినిమాకు రానివిధంగా చరిత్ర చూడని అధమ స్థితికి వసూళ్ళు పడిపోయాయి. అదీ తెలుగు వారి గొప్ప పండుగ సంక్రాంతి సెలవుల్లో కూడా కలెక్షన్లు భారీగా పడిపోయాయి. దర్శక నిర్మాతలను కలవరపరిచే పరిస్థితులు నెలకొన్నాయి. అప్పుల ఊబిలో కుంగిపోయే దిక్కు మాలిన పరిస్థితులు వాళ్లకి వస్తున్నాయి.

Image result for disastrous collections of agnathavasi
రెండో రోజే కోట్ల నుంచి లక్ష ల్లోకి వసూళ్ళు జారి పడి పోయాయి. అజ్ఞాతవాసి తెలుగు చిత్ర పరిశ్రమ లోనే అతి పెద్ద డిజాస్టర్‌ గా చిత్ర పరిశ్రమకే కళంకం తెచ్చే స్థాయి ముద్ర వేయించుకున్నట్టేనని భావిస్తున్నారు. ప్రముఖ జాతీయ మీడియా కథనం ప్రకారం అత్యంత భారీ అంచనాల కారణంగా తొలి రోజు ₹26.93 కోట్లను అజ్ఞాతవాసి సినిమా వసూలు చేయగా, కానీ రెండో రోజు నుంచే సినిమా తన పట్టు కోల్పోయింది. 
Image result for pavan kalyan trivikram
గుంటూరు ప్రాంతంలో అజ్ఞాతవాసి తొలి రోజు ₹3.78 కోట్లను వసూలు చేసింది కానీ రెండో రోజు కలెక్షన్లు ఏకంగా కేవలం 28 లక్షలకు పడిపోయాయని సదరు మీడియా చెబు తోంది. ఈ దెబ్బ కు బయ్యర్స్‌ లబోదిబో మంటున్నారు. రెండో రోజే అజ్ఞాత వాసి దాదాపు 80 శాతం కలెక్షన్లను కోల్పోయింది. దీన్నిబట్టి ఎక్కువ సంఖ్య థియేటర్లలో విడుదల చేసి "టాక్ బయటకు వచ్చే లోగా"  సొమ్ము చేసుకుందాం అనే ధోరణిని ఇప్పుడు ప్రేక్షకులు పసిగట్టేశారు.  ఫయిల్యూర్ లో కూడా ఇప్పుడు అజ్ఞాతవాసి టాలీవుడ్ ఏం ఖర్మ అంతర్జాతీయ రికార్డునే స్వంతం చేసుకున్నట్లుంది.  

Image result for failure movies of pavan kalyan

మహెష్ బాబు పవన్ కళ్యాన్ వ్యవహారం ఫెయిర్ గా లేదంటున్నారు. "అత్తారింటికి దారేది" కి ముందు పవన్ కళ్యాణ్ కు దాదాపు నాలుగు ఫెయిల్యూర్స్ ఉండగా-తరవాత మూడు ఫెయిల్యూర్స్ ఉన్నాయి. దాదాపు కుడి ఏడమగా మహెష్ పరిస్థితి అంతే. వారి రెమ్యూనరేషనే 30 శాతం సినిమా బడ్జెట్ ను తినేస్తుందని ప్రచారంలో ఉంది. సింపుల్ గా చూస్తే నాని, శర్వానంద్ సినిమాలే పవన్ మహేష్ కంటే బెస్ట్ పర్ఫార్మెన్స్ చేస్తున్నాయన్నది గుర్తించాలి అంటున్నారు. నిర్మాతలను డిస్ట్రిబ్యూటర్లను, బయ్యర్స్ ను ముంచేసి వీరిద్దరిని వదిలేస్తే మంచిదని కొందరు వీరి సినిమాలకు దూరంగా ఉంటున్నారట.
Image result for failure movies of pavan kalyan

మరింత సమాచారం తెలుసుకోండి: