మెగా స్టార్ చిరంజీవికి ఏమైంది అంటూ ఇండస్ట్రీ వర్గాలలో అందర్నీ  ఆశ్చర్యపరిచే ఒక ఆసక్తికర సంఘటన ఈమధ్య జరిగింది. 150 సినిమాల్లో నటించిన మెగాస్టార్ చీరంజీవి లుక్ విషయంలో ఎప్పుడు తేడాగా కనిపించలేదు. ఆయన వయసు ఆరు పదులు దాటిపోయినా చిరంజీవి లుక్ లో గ్రేస్ ఏమాత్రం తగ్గిపోకుండా చాల జాగ్రత్తలు తీసుకుంటున్నాడు.

 

వయసు పెరుగుతున్న కొద్దీ మెగాస్టార్ నటనలో మార్పులు చేసినట్లే తన నడకలో లుక్ లో కొత్తగా కనిపించడానికి అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు చిరంజీవి. అటువంటి చిరంజీవి లుక్ చూసి ప్రస్తుతం అందరు షాక్ అవుతున్నారు. బయటకు వచ్చినా కూడా గ్లామర్ ని మెయింటేన్ చేసే మెగాస్టార్ లుక్ లో ఇప్పుడు ఆయన వయసు స్పష్టంగా కనిపించడం చాలామందిని ఆశ్చర్య పరిచింది.

 

‘ఉయ్యాలవాడ నరసింహరెడ్డి’ కథకు చిరంజీవి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నాటి నుండి మెగాస్టార్ వెరైటీ లుక్ లో కనిపించిన విషయం తెలిసిందే. తన గుబురు గెడ్డంతో మీసాలతో చాలా కొత్తగా కనిపించాడు. కానీ రీసెంట్ గా ‘జువ్వ’ సినిమా టీజర్ రిలీజ్ వేడుకలో గెడ్డం మీసం లేకుండా కనిపించడమే కాకుండా అతడి గెడ్డం కూడ తెల్లగా ఉండటం మెగా అభిమానులకు ఏమాత్రం రుచించడం లేదు. అయితే ‘సైరా’ మూవీకి సంబంధించిన గ్రాఫిక్స్ త్రీడీ ఇమేజెస్ కోసమే మెగాస్టార్ ఈవిధంగా రెడీ అయినట్లు సమాచారం.

 

మరికొన్ని రోజుల్లో ‘సైరా’ సెకండ్ షెడ్యూల్ ని దర్శకుడు సురేందర్ రెడ్డి పొల్లాచ్చిలో స్టార్ చేయనున్నాడు అని వార్తలు వస్తున్నాయి. ఈమధ్య కాలంలో టాప్ హీరోల సినిమాలు అన్నీ భయంకరమైన ఫ్లాప్ లు గా మారుతున్న నేపధ్యంలో ఎలర్ట్ అయిన చిరంజీవి ‘సైరా’ నిర్మాణం ఆలస్యం అయినా స్క్రిప్ట్ విషయంలో అదేవిధంగా ఈమూవీ క్వాలిటీ విషయంలో ఎక్కడా ఎటువంటి పొరపాట్లు జరగకుండా అనేక జాగ్రత్తలు స్వయంగా తీసుకుంటున్నట్లు టాక్.. 




మరింత సమాచారం తెలుసుకోండి: